ఈడీ ముందుకు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి!

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మ‌రియు ఆయ‌న కుమారుడు జేసీ అశ్విత్ రెడ్డి ఇవాళ ఈడీ అధికారుల ఎదుట హాజ‌రైయారు. గ‌తంలో జేసీ కంపెనీపై న‌మోదైన ఈడీ కేసుల‌పై…

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మ‌రియు ఆయ‌న కుమారుడు జేసీ అశ్విత్ రెడ్డి ఇవాళ ఈడీ అధికారుల ఎదుట హాజ‌రైయారు. గ‌తంలో జేసీ కంపెనీపై న‌మోదైన ఈడీ కేసుల‌పై విచార‌ణ‌కు అధికారుల ముందు హాజ‌రైయారు.

2020 ఫిబ్రవరిలో అశోక్‌ లైలాండ్‌ కంపెనీకి చెందిన స్క్రాప్ కు వచ్చిన దాదాపు 150 బీఎస్‌-3 మోడల్‌ లారీలను ప్రభాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి కలిసి కొనుగోలు చేసి BS-4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు జేసీ ట్రావెల్స్ పై పలు కేసులు నమోదయ్యాయి. 

ఈడీ అధికారులు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, త‌న కుమారుడును దాదాపుగా నాలుగు గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. ఈడీ కార్యాల‌యం బ‌య‌ట జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మీడియాతో దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ త‌న‌కు త‌నుగా ఎటువంటి త‌ప్పు చేయాలేద‌ని చెప్పుకున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని జేసీ ఆరోపించారు. ఈ విషయంపై న్యాయపరంగా తేల్చుకుంటామన్నారు.