ఒక్కోసారి మంచి సినిమా అయినా మంచి డేట్ లేకుంటే ఫలితం అనుకున్నట్లు రాదు. స్వాతి ముత్యం గొప్ప సినిమా కాకున్నా, థియేటర్లో కాస్సేపు నవ్వుకుని ఎంజాయ్ చేయడానికి పనికి వచ్చే సినిమా. అలాంటి సినిమాను తీసుకువచ్చి, దసరా ఫెస్టివల్ అనే ఒకే ఒక్క ఆలోచనతో రెండు పెద్ద సినిమాల మధ్యలో పడేసారు. దాంతో జనం కళ్లు అటు పడకుండా పోయాయి. ఈ సినిమా మేకింగ్ కు కరోనా కారణంగా కాస్త ఎక్కువ సమయమే పట్టింది. దాంతో ఇంకెన్నాళ్లు హోల్డ్ చేస్తాం అనే ఆలోచనతో తొందర పడ్డారు.
పండగ తరువాత మళ్లీ అంత త్వరగా జనాలు థియేటర్ కు రారేమో అన్న అనుమానం తో అప్పటి వరకు హోల్డ్ చేసిన వాళ్లు తొందర పడ్డారు. అదే కనుక వేరే చిన్న, మీడియం సినిమాలతో విడుదల చేసుకుని వుంటే డీసెంట్ కలెక్షన్లు వచ్చి వుండేవి.
ఎందుకంటే సినిమాకు నెగిటివ్ టాక్ రాలేదు. పాజిటివ్ టాక్ నే వచ్చింది. కానీ ఆ పాజిటివ్ టాక్ ను కలెక్షన్లుగా మార్చుకోవడానికి అవకాశం కుదరలేదు.
ఘోస్ట్ సినిమాను జనం తిరస్కరించారు. గాడ్ ఫాదర్ ను చూస్తున్నారు. గాడ్ ఫాదర్ తరువాత సెకెండ్ ఆప్షన్ గా స్వాతిముత్యం నిలబడాల్సి వుంది. సినిమా కంటెంట్, ఫన్ బాగున్నా, కొత్త హీరో, కొత్త దర్శకుడు కావడంతో జనం దృష్టి కూడా సరిగ్గా పడలేదు. ఈ వీకెండ్ కు మౌత్ టాక్ ఏమన్నా స్ప్రెడ్ అయితే ఫలితం రావచ్చు. లేదంటే డేట్ విషయంలో తొందర పడినందుకు చింతించక తప్పదు.