ఆర్కే సమాధి డిమాండ్ కు నాగబాబు మద్దతు

ఆంధ్రజ్యోతి ఆర్కే మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ కళ్యాణ్ దిలీప్ సుంకర నిప్పులు చెరిగారు. ఆయనదైన స్టయిల్ లో ఆర్కే రాతలను తూర్పారబట్టారు. తనకు ఇష్టమైన వారి సినిమాలు అయితే ఒకలా, ఇష్టం లేకపోతే…

ఆంధ్రజ్యోతి ఆర్కే మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ కళ్యాణ్ దిలీప్ సుంకర నిప్పులు చెరిగారు. ఆయనదైన స్టయిల్ లో ఆర్కే రాతలను తూర్పారబట్టారు. తనకు ఇష్టమైన వారి సినిమాలు అయితే ఒకలా, ఇష్టం లేకపోతే మరోలా చేస్తారంటూ ఉదాహరణలతో సహా ఓ గట్టి విడియో బైట్ ను యూ ట్యూబ్ లో పోస్ట్ చేసారు. సోషల్ మీడియా లేకపోతే ఎల్లో మీడియా ఎలా ఆడేసుకుంటుందో, జనాలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో పాయింట్ టు పాయింట్ చెప్పారు.

అన్నీ చెప్పి చివరకు కొణిదెల బ్రదర్స్ ఎవరైనా తనకు ఓ ఎకరా స్థలం ఇవ్వాలని కోరారు. అది తను ఇల్లు కట్టుకునేందుకు కాదని, ఎప్పటికైనా ఆర్కే మరణిస్తే సమాధి కట్టడం కోసం అంటూ సెటైర్లు వేసారు. అది కూడా ఊరికి దూరంగా కట్టాలని లేదంటే సమాధిలోంచి అరుపులు వినిపిస్తాయని, ఆ సమాధిని పసుపురంగు పాలరాతితో నిర్మించాలని వెటకారం చేసారు.

అంత వరకు బాగానే వుంది. ఈ విడియోను మెగా సోదరుడు నాగబాబు ట్విట్టర్ లో షేర్ చేస్తూ, కళ్యాణ్ దిలీప్ సుంకర డిమాండ్ కు తాను మద్దతు ఇస్తున్నానని అనడం విశేషం.

ఓ పత్రికాధిపతి మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ తన అభిప్రాయం చెప్పి వుండొచ్చు తన ఆవేదన వెలిబుచ్చి వుండొచ్చు. కానీ జనసేన లాంటి పార్టీకి కీలకనేతగా వున్న నాగబాబు ఇలా ఓపెన్ గా సమాధికి స్ధలం కావాలన్న డిమాండ్ కు తాను మద్దతు ఇస్తున్నా అని అనడం సరైన పని కాదు. అది జనసేనకు సదరు మీడియాకు మధ్య వైరాన్ని పెంచుతుంది కానీ తగ్గించదు.