ఆదిపురుష్…త్రీడీలో అదిరింది

అదిరింది అన్నది క్వాలిటీ ఆఫ్ మేకింగ్ గురించి. కంటెంట్ గురించి కాదు. రామాయణాన్ని వక్రీకరించారా? రావణుడి గడ్డం ఏమిటి అలా వుంది? అవన్నీ కాదు. దిల్ రాజు చెప్పినట్లు అదంతా దర్శకుడి విజన్. దాంతో…

అదిరింది అన్నది క్వాలిటీ ఆఫ్ మేకింగ్ గురించి. కంటెంట్ గురించి కాదు. రామాయణాన్ని వక్రీకరించారా? రావణుడి గడ్డం ఏమిటి అలా వుంది? అవన్నీ కాదు. దిల్ రాజు చెప్పినట్లు అదంతా దర్శకుడి విజన్. దాంతో డిఫర్ కావడం, కాకపోవడంలో ఎవరి ఇష్టం వారిది. కానీ విజువల్ గా ఈ రోజు ప్రదర్శించిన త్రీడీ టీజర్ మాత్రం బాగుంది రామాయణంలోని యుద్ద కాండ ఆధారంగా తీస్తున్న ఆదిపురుష్ టీజర్ ను తొలిసారి త్రీ డీ లో ప్రదర్శించారు.

సరైన విధంగా తీయాలే కానీ త్రీడీ ఫార్మాట్ అన్నది కచ్చితంగా బాగుంటుంది. ఆదిపురుష్ త్రీడీ టీజర్ ఆ విషయంలో పాజిటివ్ మార్కులు కొట్టేస్తుంది. త్రీడీ లో చూడడం ఓ అనుభూతి అన్నది పక్కా. మీడియా సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇదే చెప్పారు. విజువల్ వండర్స్ గా నిలబడడం కోసం తీసే సినిమాలు మొబైల్స్ లో చూడడం అన్నది సంతృప్తిని ఇవ్వదు. థియేటర్ లో ఆ విజన్, ఆ సౌండ్ సిస్టమ్ అన్నది ప్లస్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఆదిపురుష్ కంటెంట్ మీద వస్తున్న అభ్యంతరాలను కూడా దిల్ రాజు తోసి పుచ్చారు. అది దర్శకుడి విజన్ అని దానిని పూర్తి సినిమా వచ్చిన తరువాత మాత్రమే అర్థం చేసుకోగలమని అన్నారు. బహుబలి విషయంలో కూడా ముందుగా ఇలాంటి లాజికల్ మాటలు మాట్లాడారని, కానీ అది బ్లాక్ బస్టర్ అయిందని, ఆది పురుష్ కూడా సమ్ థింగ్ స్పెషల్ గా నిలవబోతోందని అన్నారు.

దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ తమ సినిమాను బిగ్గర్ థియేటర్ ఎక్స్ పీరియెన్స్ కోసం తీసామన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ త్రీడీ లో తొలిసారి టీజర్ ను చూడగానే తాను చిన్న పిల్లాడిని అయిపోయానన్నారు.అందుకే ఈ అనుభవాన్ని అందరికీ కలిగించాలనే దాదాపు 60 థియేటర్ లలో టీజర్ ను విడుదల చేస్తున్నామన్నారు.