మీ అన్న మీకు మాత్రమే గొప్ప నాగబాబూ

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నది సామెత. గరికిపాటి-మెగాస్టార్ వ్యవహారంలో నాగబాబు స్పందన చూస్తుంటే అలాగే వుంది. Advertisement శంకరాభరణం సినిమా గుర్తుందా నాగబాబు గారూ… మంచి సంగీత కచేరి అవుతుంటే జమీందారు…

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నది సామెత. గరికిపాటి-మెగాస్టార్ వ్యవహారంలో నాగబాబు స్పందన చూస్తుంటే అలాగే వుంది.

శంకరాభరణం సినిమా గుర్తుందా నాగబాబు గారూ… మంచి సంగీత కచేరి అవుతుంటే జమీందారు వచ్చి కుర్చీ బరబరా లాగేసి, నచ్చిన అమ్మాయితో ముచ్చట్లు పెడితే శంకరశాస్త్రికి మండుకు వచ్చి, లేచి చక్కాపోతాడు. అచ్చం అలాగే వుంది. ఇవాల్టి సంఘటన.

అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి వెళ్లారు. గరికపాటి వెళ్లారు. గరికపాటి ప్రసంగించాల్సి వుంది. అలాంటి టైమ్ లో సహజంగానే ఫ్యాన్స్ అయిన మహిళలంతా మెగాస్టార్ చుట్టూ చేరి ఫొటోల కార్యక్రమం పెట్టారు. అది ఆపితే తాను మాట్లాడతానని, లేదంటే వెళ్లిపోతానని గరికపాటి అన్నారు. అదీ ఆయన చేసిన తప్పు.

ఇక ఫ్యాన్స్ గరికపాటి మీద మండిపడడం మామూలే. మెగాభిమానులైన మేధావులో, పాత్రికేయులో గరికపాటిదే తప్పు అని తీర్మానించేయడం మామూలే. కానీ మెగాస్టార్ పన్నెత్తి మాట అనలేదు. పైగా ఇదే పరిస్థితి మెగాస్టార్ కు రావచ్చు. ఆయన ప్రసంగిస్తుంటే పవర్ స్టార్..పవర్ స్టార్ అని అరుస్తుంటే ఎంత చికాకుగా వుంటుందో అర్థం అవుతుంది. సినిమా హీరోల ప్రసంగం వినిపించకుండా నినాదాలు చేస్తే సైలంట్ గా వుండమని చెప్పరా? అలా చెప్పడం తప్పా?

ఈ మాత్రం దానికి దాన్ని పెద్ద ఇస్యూ చేయడం, గరికపాటిని టార్గెట్ చేయడం సరే, నాగబాబు లాంటి వాళ్ల కామెంట్లు మరీనూ. మెగాస్టార్ ను చూస్తే ఎవరికైనా జెలసీ అంట. మెగా ఫ్యాన్స్ కు మెగాస్టార్. నాగబాబుకు మెగాస్టార్. గరికపాటి అభిమానులకు కాదు కదా? ఎవరి గొప్ప వారిది. ఎవరి స్పెషాలిటీ వారిది. ఒకే రంగం కాని వారికి జెలసీ ఎందుకు వుంటుంది?

రేపు చిరంజీవి సభలో మాట్లాడుంటే, మరో హీరో వచ్చి జనాల మధ్యలో వుండి అందరికీ సెల్ఫీలు, ఫోటొలు ఇస్తూ వుంటే అప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి.

నిజానికి ఇది టీ కప్పులో తుపాను లాంటిది. అందుకే చిరంజీవి హుందాగా తీసుకుని స్పందంచలేదు. కానీ నాగబాబు ఎందుకు దానిని కెలకడం? ప్రతి దానికి నేనున్నా అంటూ ముందుకు వచ్చేయడం నాగబాబుకు అలవాటైపోయింది. అది మెగాస్టార్ కు ప్లస్ కాకపోగా మైనస్ అవుతోంది. ఈ విషయం గమనించుకోవాలి.