హీరో తాగితే తప్పులేదు, నేను తాగితే తప్పేంటి!

రకుల్ ప్రీత్ సింగ్ సూటి ప్రశ్న ఇది. మన్మథుడు-2 ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రకుల్.. తను సిగరెట్ తాగిన సన్నివేశాన్ని బలంగా సమర్థించుకుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సిగరెట్ తాగడం లాంటి…

రకుల్ ప్రీత్ సింగ్ సూటి ప్రశ్న ఇది. మన్మథుడు-2 ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రకుల్.. తను సిగరెట్ తాగిన సన్నివేశాన్ని బలంగా సమర్థించుకుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సిగరెట్ తాగడం లాంటి బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఏమాత్రం వెనకాడనంటోంది రకుల్. ఈ సందర్భంగా మీడియాకు చిన్నపాటి క్లాస్ కూడా తీసుకుంది.

తెలుగు సినిమా వైపు ఇండియా మొత్తం చూస్తోందని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయని.. ఇలాంటి సందర్భంగా మడికట్టుకొని ఉండొద్దని, కాస్త మెచ్యూర్డ్ గా ఉండాలని క్లాస్ పీకింది. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమాలు వచ్చినప్పుడు తను సిగరెట్ తాగిన సన్నివేశంపై రచ్చ చేయడం బాగాలేదంటోంది. పైగా సినిమా కథకు, తను సిగరెట్ తాగడానికి ఎలాంటి సంబంధం లేదని, మూవీలో అవంతిక పాత్ర సిగరెట్ తాగుతుందని స్పష్టంచేసింది. అయినా హీరోలు సిగరెట్ తాగితే తప్పుబట్టని సమాజం, హీరోయిన్లు తాగితే ఎందుకు రాద్దాంతం చేస్తోందని ప్రశ్నిస్తోంది.

తనకంటే వయసులో చాలా పెద్దగా ఉన్న హీరోలతో నటించడంపై కూడా ఈ సందర్భంగా రియాక్ట్ అయింది రకుల్. కేవలం ఆ క్యారెక్టర్లు నచ్చడం వల్లనే అజయ్ దేవగన్, నాగార్జున లాంటి నటుల సరసన నటించడానికి అంగీకరించానని.. భవిష్యత్తులో మరో మంచి పాత్ర దొరికితే మరో సీనియర్ హీరో సరసన నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటోంది.

మరోవైపు తన రిలేషన్ షిప్ స్టేటస్ పై కూడా రకుల్ రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని… కాబట్టి సహజీవనం అనే ప్రస్తావన రాదని స్పష్టంచేసింది. అయినా సహజీవనం చేయాలంటే ముందు రిలేషన్ షిప్ ఉండాలని, అలాంటివేం తనకు లేవంటోంది రకుల్. వేరే వాళ్లు చేసే సహజీవనంపై తను స్పందించలేనని, తనకు మాత్రం వివాహ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని తెలిపింది.

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్