జగన్‌ని ఆయన ప్రత్యర్థులు, ముఖ్యంగా పచ్చ మీడియా ఏమంటుందంటే ఆయన నియంత. ప్రజాస్వామ్య లక్షణాలు లేని వ్యక్తి, ఇతరుల మాట వినడు. తాత రాజారెడ్డిలా ఫ్యాక్షనిస్టు ( ఆ కాలం రాజకీయాన్ని అనుసరించి కడప జిల్లాలోని నాయకులందరికీ ఫ్యాక్షన్ వుండేది. రాజారెడ్డికి మాత్రమే కాదు). ఇదే మీడియా చంద్రబాబుని మొహమాటి, మెతక, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి అని అంటుంది.
జగన్ పార్టీ పెట్టి పదేళ్లైంది. ఆ పార్టీ నుంచి కూడా బయటికి వచ్చిన వాళ్లున్నారు. మరి ఎవరూ కూడా కన్నీళ్లతో జగన్‌పైన దుమ్మెత్తిపోయలేదు. దివ్యవాణిలా పార్టీలో మహిళలకి గుర్తింపులేదు, అన్యాయం జరుగుతోందని అనలేదు. జగన్ కరివేపాకులా వాడుకుని వదిలేశాడని మాటే రాలేదు. జగన్ చుట్టూ వున్న కోటరీ అవమానిస్తోందని, చెప్పుడు మాటలు మోస్తుందని అనలేదు.
మరి చంద్రబాబు స్థితి? జయప్రద, రోజా, జయసుధ ఇపుడు దివ్యవాణి. చుట్టూ భజన బృందాలు పెట్టుకున్న బాబు ప్రజాస్వామ్యవాది ఎలా అవుతాడు? పవర్ లేనప్పుడు అందరితో చాకిరి చేయించుకుని , పవర్లోకి రాగానే డబ్బులున్న వాళ్లకి పదవులు ఎట్లా ఇస్తాడో అందరికీ తెలుసు. కరివేపాకు జాబితాలో దివ్యవాణి ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. ఇదో Use And Throw Process.
ఒకవేళ జగన్ పార్టీలో నుంచి ఎవరైనా మహిళా నాయకురాలు బయటికి వచ్చి ప్రెస్‌మీట్ పెడితే రచ్చరచ్చ చేసే పచ్చ మీడియా దివ్యవాణి వార్తని ప్రాధాన్యం లేకుండా లోపలి పేజీల్లో వేసింది.
2019లో జగన్ ఓడిపోతాడని గాఢంగా నమ్మిన మీడియానే ఇపుడు బాబు అధికారంలోకి వస్తాడని కూడా నమ్ముతోంది. బాబుకు వేరే శత్రువులు అక్కర్లేదు. పార్టీ లోపల భజనపరులు, బయట భజన పత్రికలు.
జీఆర్ మహర్షి