ఆర్జీవీ ఆశ పెరిగిందిగా

బూతు సినిమాలు చూడడానికి జనం ఎగబడతారని దర్శకుడు ఆర్జీవీ నమ్మకం. కరోనా టైమ్ థియేటర్లు లేకపోయినా, ఆన్ లైన్ లోకి వదిలాడు క్లయిమాక్స్ అనే యాభై నిమషాల సినిమాను. వంద రూపాయలు పే చేసి…

బూతు సినిమాలు చూడడానికి జనం ఎగబడతారని దర్శకుడు ఆర్జీవీ నమ్మకం. కరోనా టైమ్ థియేటర్లు లేకపోయినా, ఆన్ లైన్ లోకి వదిలాడు క్లయిమాక్స్ అనే యాభై నిమషాల సినిమాను. వంద రూపాయలు పే చేసి మరీ ఎగబడ్డారు జనం. రెండు లక్షలకు పైగా చూసారని ఆన్ లైన్ థియేటర్ నిర్వాహకులు ప్రకటించారు. సరే సినిమా ఎలా వుంది? 100 రూపాయలు కిట్టుబాటు అయినట్లా? కాదా? అన్నది పక్కన పెడితే, ఆ సినిమా విజయం ఇచ్చిన కిక్ తో వెంటనే ఆర్జీవీ 'నగ్నం' అనే మరో సినిమాను మూడు భాషల్లో అనౌన్స్ చేసాడు.

ఈ సినిమా ట్రయిలర్ వదిలారు. ట్రయిలర్ కట్ చేయడంలో ఆర్జీవీ మెునగాడు. అందులో సందేహం లేదు. నగ్నం ట్రయిలర్ కూడా తనకు ఇష్టమైన సెక్స్, హర్రర్ మిక్స్ చేసి వదిలినట్లు కనిపించింది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఈ సారి టికెట్ రేటును 200 చేసేసారు.  అంటే బూతు సినిమాల మీద జనాలకు వున్న ఆసక్తి మీద ఆర్జీవీకి మరింత నమ్మకం పెరిగింది అనుకోవాలి.

కానీ ఇది అత్యాశ అవుతుందేమో అన్న భయం కూడా వుంది. ఎందుకంటే క్లయిమాక్స్ లో వంద రూపాయలకు సరిపడా 'ఆ కంటెంట్' లేదని కుర్రాళ్లు నిట్టూరుస్తున్నారు. అందువల్ల నగ్నం సినిమాకు వెంటనే రెండు వందల పెట్టడానికి సిద్దంగా వుండరు. చూసిన వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తరువాత కానీ రెండు వందలు పెట్టి టికెట్ కొనడం కష్టం. అందువల్ల ఈసారి ఆర్జీవీ రేటు పెంచితే సరి కాదు. 'ఆ కంటెంట్' విషయంలో డోస్ కూడా పెంచాల్సి వుంది. అప్పుడు కిట్టుబాటు అవుతుంది. ఇటు  అటు కూడా.

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు

తమ్ముడు అలా.. అన్న ఇలా