దగ్గుబాటి వారసుల ఎంట్రీ ఎప్పుడు?

నటవారసుల రాక టాలీవుడ్ కు కొత్తకాదు. దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ లో భాగంగా వెంకటేష్ కొడుకు అర్జున్, సురేష్ బాబు కొడుకు అభిరామ్ కూడా సిల్వర్ స్క్రీన్ పైకి వస్తారని చాలామంది…

నటవారసుల రాక టాలీవుడ్ కు కొత్తకాదు. దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ లో భాగంగా వెంకటేష్ కొడుకు అర్జున్, సురేష్ బాబు కొడుకు అభిరామ్ కూడా సిల్వర్ స్క్రీన్ పైకి వస్తారని చాలామంది భావిస్తున్నారు. వీళ్ల టాలీవుడ్ ఎంట్రీపై సురేష్ బాబు స్పందించారు. ముందుగా అర్జున్ ఎంట్రీపై స్పందిస్తూ.. ఇప్పటివరకు అలాంటి చర్చ రాలేదని స్పష్టంచేశారు సురేష్ బాబు.

“అర్జున్ నెక్ట్స్ టార్గెట్ అమెరికా. లాక్ డౌన్ తర్వాత ప్రపంచం ఓపెన్ అయితే వాడు చదువుకోవడానికి అమెరికా వెళ్తాడు. సినిమాల్లోకి తీసుకురావాలా వద్దా అనే చర్చ ఇప్పటివరకు జరగలేదు. అయినా మా ఇంట్లో మేం పిల్లలకే నిర్ణయాలు వదిలేస్తాం. ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్లే డిసైడ్ చేసుకుంటారు. మేం ఎవరిపై ఫోర్స్ చేయం. కాకపోతే లాభనష్టాలు, కష్టసుఖాల గురించి మాత్రం చెబుతాను. నిర్ణయం వాళ్లే తీసుకుంటారు.”

అయితే తన రెండో కొడుకు అభిరామ్ కు మాత్రం నటుడు అవ్వాలనే కోరిక బలంగా ఉందంటున్నారు సురేష్ బాబు. ఈ మేరకు అభిరామ్ ట్రయినింగ్ కూడా తీసుకున్నాడని.. అయితే అతడు నిరూపించుకునేంతవరకు తన సపోర్ట్ ఉండదంటున్నారు సురేష్ బాబు.

“అభిరామ్ కు నటుడు అవ్వాలని ఉంది. అతడు ఇండస్ట్రీలోకి వస్తాడు. ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఎప్పుడైతే అతడు తనను తాను నిరూపించుకుంటాడో.. దర్శకులు అతడితో సినిమాలు చేయడానికి ముందుకొస్తారో అప్పుడు వాడ్ని నేను సపోర్ట్ చేస్తాను. ఈ విషయంలో నేను చాలా ప్రాక్టికల్ గా ఉంటాను. ఫలానా వ్యక్తి పిల్లలని ప్రేక్షకులు సినిమాలు చూడరు. టాలెంట్ ఉంటేనే చూస్తారు. సో.. అదంతా అభిరామ్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతవరకు నేను పట్టించుకోను.”

ఇలా దగ్గుబాటి వారసుల ఎంట్రీపై సురేష్ బాబు స్పందించారు. రానా హీరో అవుతానని అన్నప్పుడు కూడా తను సపోర్ట్ ఇవ్వలేదని, తనే కష్టపడి హీరోగా ఎదిగాడని, అలా తననుతాను నిరూపించుకున్న తర్వాతే తను మద్దతిచ్చానని అన్నారు సురేష్ బాబు.

కేటీఆర్ చాలా నిజాయితీ పరుడు

రెండేళ్లు కాదు బాలయ్యా.. తర్వాత ఐదేళ్లూ ఆ పైన ఐదేళ్లూ జగనే సీఎం