ఎక్స్ క్లూజివ్-బాలయ్య బర్త్ డే స్పెషల్స్

నందమూరి హీరో బాలకృష్ణ 60 వ బర్త్ డే హంగామా మామూలుగా లేదు. ఈసారి ఈ బర్త్ డే కు చాలా సర్ప్రయిజ్ లు ప్లాన్ చేసారు. ముఖ్యంగా ఇవి నాలుగు. Advertisement 1.…

నందమూరి హీరో బాలకృష్ణ 60 వ బర్త్ డే హంగామా మామూలుగా లేదు. ఈసారి ఈ బర్త్ డే కు చాలా సర్ప్రయిజ్ లు ప్లాన్ చేసారు. ముఖ్యంగా ఇవి నాలుగు.

1. గాయకుడు సింహా తదిరులు పాడిన పాట. జై బాలయ్య..జై జై బాలయ్యా అంటూ సాగే ఈ పాట ఆద్యంతం నందమూరి బాలకృష్ణ ను ఆకాశంలోకి ఎత్తుతూ సాగుతుంది. ''…..నందమూరి వంశోద్దారకుడా హిందూపురమున విజయసింహుడయ్యావురా కొండవీటి సింహపు వారసుడాబసవతారకం ఆసుపత్రి నడిపావురా ….ఇలాంటి పదాలు వుంటాయి. అంతే కాదు, కిందా మీదా ఊపు, బాలయ్య బాబు తోపు లాంటి మీమ్ వర్డ్స్ కూడా ఇందులో వుంటాయి. అహో బాలయ్య..ఓహో బాలయ్యా అంటూ ఆద్యంతం విపరీతమైన పొగడ్తలతో ఈ పాట వుంటుంది.

2. బాలయ్య స్వయంగా పాడిన పాట. ఈ పాట కరోనా మీద సాగుతుంది. ఈ పాటను బాలయ్య తో పాటు మరో లేడీ సింగర్ కూడా ఆలపించినట్లు తెలుస్తోంది.

3. బోయపాటి-బాలయ్య సినిమా నిర్మాణంలో వుంది. దీనికి సంబంధించి చిన్న..అతి చిన్నటీజర్ ఓకటి విడుదల చేయబోతున్నారు.

4. ఇక నాలుగో సర్ప్రయిజ్. ఇది ఊహకు అందనిది. ఎప్పుడో బాలయ్య నర్తనశాల సినిమాను తీసి, హీరోయిన్ సౌందర్య మరణంతో ఆఫేసారు. ఇప్పుడు ఆ ఫుటేజ్ లోంచి కొంత తీసి చిన్న విడియో చేసే ప్రయత్నంలో వున్నారు. దీనికి  బాలయ్య వాయిస్ ఓవర్ వుంటుంది.

ఈ నాలుగు వరుసగా రోజుకు ఒకటి వంతున లేదా రెండు వంతున విడుదల చేస్తారు. వీటితో పాటు బాలయ్య పాట మేకింగ్ విడియోలు కూడా విడుదల చేస్తారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ కు పండగే పండగ.

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు