మొత్తానికి జనంలోకి వస్తే పొలిటికల్ గా హీరో కావచ్చు అని టీడీపీ నేత లోకేష్ భావించారో ఏమో కానీ ఆయన చావు పరామర్శ టూర్లు మాత్రం పరిహాసంగానే సాగుతున్నాయన్న మాట ఉంది. దీని మీద ఏకంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు.
చావుకు పెళ్ళికీ ఒకే మంత్రమా లోకేశా అంటూ ఆయన బాగానే సెటైర్లు వేశారు. తమ ఇంటి ఆడబిడ్డ పోయి రమ్య ఫ్యామిలీ ఉంటే లోకేష్ బొట్టు పెట్టి పిడికిలి బిగించి గుంటూర్ లో యుద్ధానికి వెళ్ళినట్లుగా పరామర్శకు వెళ్లడమేంటని మంత్రి నిలదీశారు.
ఇక శవాన్ని ఇంటికి తీసుకెళ్ళకుండా అడ్డుకోవడం, రోడ్డు మీద రచ్చ చేయడం కంటే చిల్లర రాజకీయం ఉంటుందా అంటూ చినబాబుని ప్రశ్నించారు. కేరాఫ్ చంద్రబాబు గా ఈ రోజుకీ జనంలోకి వస్తున్న లోకేష్ కి అది తప్ప వేరే ఏదైనా అర్హత ఉందా అని కూడా సూటిగానే అడిగేశారు.
జగన్ని వ్యక్తిగతంగా తిడితే తాను పెద్ద నాయకుడిని అయిపోతాను అన్న భ్రమలో లోకేష్ ఉంటే చేసేది ఏమీ లేదని కూడా మంత్రి అన్నారు. లోకేష్ అమెరికాలో చదివాను అంటారు, మరి ఆయన నోటి వెంట బూతులేంటి అంటూ మంత్రి ముక్కున వేలేసుకున్నారు.
లోకేష్ గ్రామ స్థాయి నాయకుడు కూడా కాలేక ఇలా తమ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని అవంతి బాగానే కౌంటర్లేశారు. మొత్తానికి లోకేశ్ తీరు ఇలాగే ఉంటే ఎప్పటికీ హీరో కాలేడు కదా జీరో గానే మిగిలిపోతాడు అంటూ జోస్యం కూడా చెప్పేశారు.