టాలీవుడ్ జనాలు తొలిసారిగా రెండు పదుల సంఖ్యలో ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలవడానికి వెళ్తున్నారు. ఎవరు ఎవరు వస్తున్నారు? అందులో కాస్త పేరు, వ్యవహారం వున్నవారు ఎవరు? వీరి వ్యవహారం ఏమిటి? వీళ్ల పార్టీ ఎఫిలియేషన్లు ఏమిటి? ఇలాంటివి అన్నీ ముందుగానే ముఖ్యమంత్రి జగన్ కు బ్రీఫింగ్ జరిగిపోయినట్లు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాది అయింది. ఇప్పటి వరకు ఆయనను కలిసి అభినందించే వ్యవహారం టాలీవుడ్ చేయలేదు. విడివిడిగా, కామ్ గా కలిసి వచ్చినవారు కొందరు వున్నారు. అంతే తప్ప అధికారికంగా వెళ్లి అభినందించి వచ్చిన వారు లేరు
ప్రమాణ స్వీకారం టైమ్ లో దిల్ రాజు, తరువాత డైరక్టర్ మహీ, ఓ పెద్ద బ్యానర్ అధినేత, ఇలా వేరు వేరుగా కలిసారు తప్ప, ఇండస్ట్రీ తరపున మాత్రం కాదు. టాలీవుడ్ నుంచి వెళ్లిన జాబితాలో ఆంధ్ర సిఎమ్ కార్యాలయం ఒకటి రెండు మార్పులు చేర్పులు కూడా చేసినట్లు బోగట్టా. ఓ దర్శకుడి పేరు టాలీవుడ్ నుంచి వెళ్లలేదు. కానీ అక్కడ చేర్చారు.అయితే అంత బాగోదని ఆ దర్శకుడు వెళ్లడం లేదు.
సురేష్ బాబు లాంటి వారు హార్డ్ కోర్ తెలుగుదేశం అని అందరికీ తెలుసు. టాలీవుడ్ ఇండస్ట్రీ గతంలో వైఎస్ సిఎమ్ గా వున్నపుడు కూడా ఆయనను పెద్దగా పట్టించుకోలేదన్న విషయాన్ని సిఎమ్ జగన్ కు ముందుగానే ఫీడింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా సీరియస్ గా విశాఖలో సినిమా పరిశ్రమను అభివృద్ది చేయాలనే ఆలోచనలో జగన్ వున్నారని బోగట్టా. ఇప్పుడు దీన్ని అందిపుచ్చుకుని, విశాఖలో స్థలాలు పొందే ఆలోచనలో టాలీవుడ్ పెద్దలు వున్నారు. ఆ ఆశలతోనే కరోనా భయం ఓ పక్క వెన్నాడుతున్నా, ఛలో అమరావతి అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రెండేళ్లు కాదు బాలయ్యా.. తర్వాత ఐదేళ్లూ ఆ పైన ఐదేళ్లూ జగనే సీఎం