విశాఖ మీద బాలయ్య కూడానా ?

విశాఖనగరం నాకు చాలా ఇష్టమైన సిటీ అంటారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఆచరణలో మాత్రం ఆయన ఉల్టాగా ఉంటారు. విశాఖను పాలనారాజధాని చేస్తామని వైసీపీ సర్కార్ అంటే మోకాలడ్డుతారు. విశాఖ అసలు పనికిరాదు అంటారు.…

విశాఖనగరం నాకు చాలా ఇష్టమైన సిటీ అంటారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఆచరణలో మాత్రం ఆయన ఉల్టాగా ఉంటారు. విశాఖను పాలనారాజధాని చేస్తామని వైసీపీ సర్కార్ అంటే మోకాలడ్డుతారు. విశాఖ అసలు పనికిరాదు అంటారు.

సరే తమ్ముళ్ళు కూడా అదే తీరున ఉంటారు. విశాఖను ఎట్టిపరిస్థితుల్లో రాజధాని కానివ్వమని సీనియర్ నేతలే భారీ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇవన్నీ ఇలా ఉంటే సినీ నటుడిగా, కళాకారుడిగా ఉన్న బాలక్రిష్ణ సైతం విశాఖ గురించి అపశకునాలు పలకడమే విడ్డూరం, విచిత్రం.

గత తెలుగుదేశం హయాంలో ఎటూ విశాఖకు సినీ పరిశ్రమకు తేలేకపోయారు. ఇపుడు వైసీపీ సర్కార్ ఆ ప్రయత్నాలు చేస్తూంటే మాత్రం ముందే శాపాలు పెట్టడం భావ్యమేనా అంటున్నారు మేధావులు.

విశాఖకు టాలీవుడ్ ఎట్టిపరిస్థితుల్లో తరలిపోదు అని బాలయ్య అంటున్నారు. హైదరాబాద్ లోనే ఎప్పటికీ ఉంటుందని కూడా అయన చెబుతున్నారు. తాను విశాఖలోనే ఎక్కువ షూటింగులు చేశానని చెబుతున్న బాలయ్యకు ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం ఇంతేననుకోవాలేమో.

ఇక విశాఖకు టాలీవుడ్ మొత్తం వచ్చేయనక్కరలేదు, ఇక్కడ కూడా సినిమా యాక్టివిటీ పెరిగితే భవిష్యత్తులో కొంత అయినా పరిశ్రమ వేళ్ళూనుకునే అవకాశాలు ఉంటాయన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన. తపన. ఆ దిశగా జగన్ సర్కార్ ముందడుగు వేసి సినీ పెద్దలతో చర్చలకు శ్రీకారం చుడుతున్న వేళ అంతా స్వాగతించాలి.

కానీ విశాఖ అంటేనే తెలుగుదేశానికి అదో రకం నెగిటివిటీ ఉందేమో తెలియదు కానీ పాలనా రాజధాని అంటే ఠాట్ కుదరదు అంటారు. సినిమా పరిశ్రమ అసలు తరలిరాదు అంటారు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమైనా గానీ రాజకీయమే ముఖ్యమనుకుంటున్నారేమో.

ఏది ఏమైనా ప్రయత్నం చేస్తేనే ఫలితం ఉంటుంది. విశాఖకు సినీ రాజధాని కళ ఉందని అంత ఒప్పుకుంటారు. ఆ దిశగా జరిగే కసరత్తు విజయవంతం కావాలని మాత్రం అందరూ కోరుకోవాలి.

రెండేళ్లు కాదు బాలయ్యా.. తర్వాత ఐదేళ్లూ ఆ పైన ఐదేళ్లూ జగనే సీఎం

కేటీఆర్ చాలా నిజాయితీ పరుడు