సంజన రెడ్డికి ఏమయింది?

ఈ రోజు ఉదయం నుంచి టాలీవుడ్ లో చాలా ఎక్కువ వినిపించిన ప్రశ్న ఇది. అలా అని సంజన రెడ్డి మరీ భయంకరంగా అందరికీ పరిచయం వున్న పేరు కాదు. రాజుగాడు సినిమాతో తొలిసారి…

ఈ రోజు ఉదయం నుంచి టాలీవుడ్ లో చాలా ఎక్కువ వినిపించిన ప్రశ్న ఇది. అలా అని సంజన రెడ్డి మరీ భయంకరంగా అందరికీ పరిచయం వున్న పేరు కాదు. రాజుగాడు సినిమాతో తొలిసారి దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఆ పేరు పెద్దగా వినిపించలేదు.  ఇటీవల కోన వెంకట్ నిర్మాణంలో కరణం మల్లీశ్వరి బయోపిక్ కు ఆమె పేరు అనౌన్స్  అయింది. 

ఈ రోజు ఆమె సీరియస్ గా సిక్ అయి యశోదా ఆసుపత్రిలోనో, అపోలోలోనో జాయిన్ అయ్యారన్న వార్త గుప్పు మంది. అంతకు మించి వివరాలు తెలియలేదు. పైగా ఆమె రెండు ఫోన్ నెంబర్లు స్విచాఫ్ వచ్చాయి. ఆమెతో పరిచయం వున్నవారిని కొందరిని సంప్రదించాలని ప్రయత్నించినా వీలు కాలేకపోయింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సంజనారెడ్డి ఇటీవల కొంతకాలంగా డయిటింగ్ లో వున్నారు. ఈ డయిటింగ్ వికటించి, బ్రెయిన్ వీక్ నెస్ వచ్చి పడిపోయారని, ఎవ్వరూ లేకపోవడంతో, ఆమె పెంపుడు కుక్క గట్టిగా అరిచి, వాచ్ మన్ ను అలెర్ట్ చేసిందని బోగట్టా. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తోంది.

ఈసాయంత్రం డిశ్చార్జి చేస్తారని, ప్రమాదం ఏమీ లేదని కోనవెంకట్ చెప్పారంటూ కొందరు వెల్లడించారు. ఇంకా డిశ్చార్జి చేసారా?  లేదా? అన్నది మాత్రం తెలియలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన సంజన రెడ్డి చాలా కాలంగా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తున్నారు. కరణం మల్లీశ్వరి బయోపిక్ ఆమె డ్రీమ్ ప్రాజెక్టు.

కేటీఆర్ చాలా నిజాయితీ పరుడు