అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం పరిస్థితే టాలీవుడ్ లో ఆ దర్శకుడిది కూడా. హీరోయిన్ కాలేకపోయినా క్యారెక్టర్ నటిగా స్థిరపడిన ఓ అమ్మాయి మీద మనసుపడ్డాడు.
తన సినిమాల్లో చాన్స్ లు కూడా ఇచ్చాడు. కానీ అక్కడితో సరిపోతుందా? చాలదు కదా? బెంజ్ కారు కూడా కొనిచ్చాడు. ఫ్లాట్ నో, విల్లానో కూడా సమర్పించేసుకున్నాడు. ఇలా ఎంత చేయాలో అంతా చేసాడు. ఇంక తడి లేదు అని ఆ అమ్మడు అనుకుందో, తన సరదా తీరిపోయిందని దర్శకుడే వదిలేసాడో మొత్తం మీద బంధం తెగింది.
కానీ బంధం వున్నన్నాళ్లు మెయింటయిన్ చేయడానికి పాపం మామూలుగా ఖర్చు కాలేదని బోగట్టా. మామూలుగానే కాస్త భక్తి ఎక్కువ ఈ దర్శకుడికి. దాంతో ఇక మళ్లీ మరోసారి సాంతం నాకించేసుకోవడం ఇష్టం లేక, పూర్తిగా భక్తి మార్గంలో పడిపోయారని టాలీవుడ్ జనాల బోగట్టా. ఇప్పుడు ఆ అమ్మడు ఇలా సంపాదించిన సామగ్రితో. ఒకటీ అరా వేషాలతో ముందుకు సాగిపోతోంది.
దర్శకుడు మాత్రం మళ్లీ సంపాదించుకోవాలి కదా? అందుకే సరైన సినిమా చేతిలోకి రప్పించుకోవాలని శ్రద్దగా స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నారట.
Paapaam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Neeku raskodaniki leka Ila vestunnav. Gasu