రెస్టారెంట్ బిజినెస్‌పై అందాల తార క‌న్ను

లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు బంద్ అయ్యాయ‌నే మాటే త‌ప్ప‌, బుల్లితెర‌, వెండితెర‌కు సంబంధించిన వాళ్లు ఇళ్ల ద‌గ్గ‌రే ఉంటూ బిజీగా గడుపుతున్నారు. ఇంట్లోనే ఉంటూ సినిమాల‌కు సంబంధించి చేయాల్సిన ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నారు. Advertisement లాక్‌డౌన్…

లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు బంద్ అయ్యాయ‌నే మాటే త‌ప్ప‌, బుల్లితెర‌, వెండితెర‌కు సంబంధించిన వాళ్లు ఇళ్ల ద‌గ్గ‌రే ఉంటూ బిజీగా గడుపుతున్నారు. ఇంట్లోనే ఉంటూ సినిమాల‌కు సంబంధించి చేయాల్సిన ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నారు.

లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఎలా గడుపుతున్నార‌నే ప్ర‌శ్న‌కు రాధికా ఆప్టే స్పందిస్తూ ఎనిమిదేళ్లుగా అవిశ్రాంతంగా సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయ్యాన‌న్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా ల‌భించిన ఈ విరామ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. అదెలా అంటే కొన్ని స్క్రిప్ట్ర్స్ రాసుకుంటూ అని ఆమె స‌మాధానం ఇచ్చారు.

అంతేకాదు భ‌విష్య‌త్ గురించి ఎక్కువ‌గా ఆలోచిస్తూ ప్ర‌స్తుత ఈ స‌మ‌యంలో అసంతృప్తిగా గ‌డ‌ప‌వ‌ద్ద‌ని ఆమె సూచించారు. ఎందుకంటే నేను ఎప్పుడూ అసంతృప్తిగా ఉండ‌ని కాబ‌ట్టి అని చెప్పుకొచ్చారు. జీవితంలో తాను సంతోషంగా ఉండ‌డానికి ప్ర‌ధానం కార‌ణం ఆ ఫిలాస‌ఫీనే అని రాధికా ఆప్టే వెల్ల‌డించారు.

ఈ లాక్‌డౌన్ త‌న‌లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంద‌న్నారు. సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి ఓ రెస్టారెంట్‌ ఆరంభిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా వచ్చిందంటూ స‌ర‌దాగా ఆమె అన్నారు. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రాధిక డైరెక్ట్‌ చేశారు. అది ఓ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కూడా  ఎంపికైంద‌ని ఆమె గ‌ర్వంగా చెప్పారు. ఈ సినిమా వివరాలను త్వరలో చెబుతాన‌ని రాధికా ఆప్టే తెలిపారు.

ఇన్ని పనులు చేసిన ముఖ్యమంత్రిని చూడలేదు