అయ్యా గులాం నబీ.. ఏం సెప్తిరి ఏం సెప్తిరీ…

తన దాకా వస్తే కానీ నొప్పి తెలియలేదు అన్నట్లుగా ఉన్నది కాంగ్రెసు పార్టీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ పరిస్థితి. కాశ్మీరును ఇవాళ మోడీ సర్కారు మూడు ముక్కలు చేసే…

తన దాకా వస్తే కానీ నొప్పి తెలియలేదు అన్నట్లుగా ఉన్నది కాంగ్రెసు పార్టీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ పరిస్థితి. కాశ్మీరును ఇవాళ మోడీ సర్కారు మూడు ముక్కలు చేసే సరికి.. ఆయన విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి విభజనను కలలో కూడా ఊహించలేదని అంటున్నారు.

ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పాలన, రాష్ట్ర యంత్రాంగానికి ఏమాత్రం ఫోకస్ ఉండని లడాఖ్ ప్రాంతాన్ని వేరు చేసినందుకే ఆయన ఇంతగా విలవిల్లాడిపోతున్నారే… మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నరికిన కాంగ్రెస్ నిర్ణయం ఆయన చేతులమీదుగా జరిగిందే కదా.. ఇలాంటి భావోద్వేగపు నాటకాల డైలాగులు ఆరోజు ఆయన ఎలా విస్మరించారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకూ సభలో గులాం నబీ చెబుతున్న మాటలు ఏంటో తెలుసా…

ఎన్నికలకోసం కేంద్రం విపరీత నిర్ణయాలు తీసుకుంటోంది.. ఓటు బ్యాంకు రాజకీయాలను సహించం… ఓట్లకోసమే ఇదంతా చేశారు… కేంద్ర నిర్ణయం నెత్తిన బాంబు వేసినట్లయింది… ఈ నిర్ణయం ఆ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెడుతోంది.. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఖూనీ చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ ఈ నిర్ణయంపై పోరాదాలి… మిలిటరీని తరలించి ఈ నిర్ణయం తీసుకున్నారు…

ఇప్పుడు విషయానికి వద్దాం…

గులాంనబీ మాటలు అన్నింటినీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భానికి అన్వయించుకుని చూడండి.. అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెసు దుర్మార్గానికి అన్నీ అతికినట్లుగా సరిపోతాయి. అప్పట్లో ఏపీని చీల్చిన కమిటీలో గులాం నబీ కూడా ఒక కీలక సభ్యుడు. ఆ పాపం ఊరికేపోలేదు. ఇపుడు ఆయనకు ఈ రకమైన క్షోభ రూపంలో తిరిగి తగిలింది.

నిజానికి గులాంనబీ ఎందుకింత దుఃఖిస్తున్నారో అర్థం కాని సంగతి. ఏపీ చీలిపోతుందని ఇక్కడి ప్రజలు కూడా ఎన్నడూ అనుకోలేదు. పైగా.. ఒకప్పుడు విడిగా ఉన్న ప్రాంతాలని అప్పటి ఉద్యమాలకు వ్యతిరేకంగా, ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేంద్రమే ‘కలిపేసిన’ తర్వాత.. మళ్లీ చీలుస్తుందని వారు భావించలేదు. కాశ్మీరుకు అలాంటి ప్రమాదం కూడా లేదు.

మరి గులాంనబీ ఎందుకు దుఃఖించడం. ఓట్ల కక్కుర్తితో తాము ఎలాంటి దుర్మార్గాలు చేశారో, తమ పీచమణచడానికి ఎవరికి అధికారం వస్తే వారు అలాంటి పనులే చేస్తారనే నీతిని ఆయన తెలుసుకోవాలి.