టైగర్ 3.. సల్మాన్-కత్రినా స్పెషల్ రిక్వెస్ట్

ఓ కొత్త సినిమా వస్తుందంటే, థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయమని ఎవరైనా చెబుతారు. హీరో సల్మాన్ కూడా అదే చెబుతున్నాడు. కాకపోతే దీంతో పాటు మరో ప్రత్యేకమైన కోరిక కూడా కోరుతున్నాడు. Advertisement…

ఓ కొత్త సినిమా వస్తుందంటే, థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయమని ఎవరైనా చెబుతారు. హీరో సల్మాన్ కూడా అదే చెబుతున్నాడు. కాకపోతే దీంతో పాటు మరో ప్రత్యేకమైన కోరిక కూడా కోరుతున్నాడు.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది టైగర్-3. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయట. ఇందులో మలుపులు ప్రేక్షకులకు షాక్ ఇస్తాయట. సరిగ్గా ఇక్కడే ప్రత్యేక విన్నపం చేస్తున్నాడు సల్మాన్. సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయండి, అంతే తప్ప సర్ ప్రైజ్ లు బయటపెట్టకండి అంటున్నాడు. స్పాయిలర్స్ ఇవ్వడం వల్ల ఇంకా సినిమా చూడని ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోతుందని, దయచేసి ఈ విషయంలో సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని ప్రేక్షకులను కోరుతున్నాడు.

సినిమాపై తమ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు చెప్పాలని కోరుతున్న సల్మాన్, అదే టైమ్ లో స్పాయిలర్స్ మాత్రం ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇదే విషయాన్ని హీరోయిన్ కత్రినాకైఫ్ కూడా చెబుతోంది.

సినిమాలో జోయా అనే పాత్రలో కనిపించనుంది కత్రిన. తమ పాత్ర ఆద్యంతం సర్ ప్రైజులు, మలుపులతో నిండి ఉంటుందని, దయచేసి తన పాత్ర గురించి సోషల్ మీడియాలో చర్చించవద్దని కోరుతోంది. టవల్ కట్టుకొని తను చేసిన ఫైట్ లో కూడా చిన్నపాటి సర్ ప్రైజ్ ఉందని, అవేవీ బయటకు చెప్పొద్దని కోరుతోంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కింది టైగర్ 3. మనీష్ శర్శ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దక్కాయి.