‘శ్రీశైలం’ సగానికి.. కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు సగం వరకూ నిండినట్టుగా అధికారులు ప్రకటించారు. దాదాపు 215 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి వంద టీఎంసీల పై స్థాయి వరకూ నీరు చేరిందని అధికారులు ప్రకటించారు.…

శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు సగం వరకూ నిండినట్టుగా అధికారులు ప్రకటించారు. దాదాపు 215 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి వంద టీఎంసీల పై స్థాయి వరకూ నీరు చేరిందని అధికారులు ప్రకటించారు. కాస్త ఆలస్యంగా అయినా శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది.

పశ్చిమకనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటోంది. ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతతో గతవారం నుంచి ఈ ప్రాజెక్టుకు నీరు చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు సగంవరకూ ప్రాజెక్టును నీరు నింపేసింది.
 
మరోవైపు ఇంకా వరద కొనసాగుతూ ఉంది. ఇంకో వారంరోజుల పాటు ఇదే రకమైన వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కృష్ణకు ఇలా ఫర్వాలేదనిపించుకునే స్థాయి వరద కొనసాగుతూ ఉంది. 

అయితే పశ్చిమ కనుమల్లో కూడా ఈ సారి ఇంకా పూర్తిస్థాయిలో వర్షపాతం లేదు. కనీస వర్షపాతం కూడా ఇంకా నమోదు కాలేదు. ఆగస్టులో కురిసే వర్షాలు అక్కడ భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ మేరకు వర్షపాతం నమోదు అయితే ఆగస్టు ఆఖరు వరకూ వరద కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఈ స్థాయి వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడిన ప్రాంతానికంతా నీరు అందించే అవకాశాలుంటాయి.

తెలుగుదేశం.. ‘నో ప్లాన్’ వారి గేమ్ ప్లాన్