వైఎస్ జగన్ రిటర్న్స్.. ప్రధానితో సమావేశం

ఇజ్రాయెల్ పర్యటనను ముగించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం స్వరాష్ట్రం చేరుకోనున్నారు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు జగన్ తాడేపల్లికి చేరుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. ఇక బుధవారం రోజున ప్రధానమంత్రి…

ఇజ్రాయెల్ పర్యటనను ముగించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం స్వరాష్ట్రం చేరుకోనున్నారు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు జగన్ తాడేపల్లికి చేరుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. ఇక బుధవారం రోజున ప్రధానమంత్రి మోడీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడ రాష్ట్రపతితో సహా కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులను కలవబోతూ ఉన్నారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా వివిధ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. పునర్విభజన చట్టంలోని అంశాల్లో కేంద్రం వద్ద పెండింగులోని అంశాలను, వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి విడుదల కావాల్సి ఉన్న నిధుల గురించి , స్టీల్ ప్లాంటు, ఓడరేవు అంశాలను ప్రధాని, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లబోతున్నారట ముఖ్యమంత్రి.

అలాగే పోలవరం ప్రాజెక్టు లో రివర్స్ టెండరింగ్ అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లబోతున్నారట ముఖ్యమంత్రి. తద్వారా ప్రజాధనం ఆదా అయ్యే విషయాన్ని జగన్ వివరించబోతున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగుదేశం.. ‘నో ప్లాన్’ వారి గేమ్ ప్లాన్