కమెడియన్ సునీల్ కు బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో పాత్ర లేనట్లే. వాస్తవానికి మంచి పాత్ర ముందుగా అనుకున్నారు కానీ, లేటెస్ట్ పరిణామాలతో అది కాస్తా లేపేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ కు సునీల్ అత్యంత ప్రాణ స్నేహితుడు. హీరోగా నిలదొక్కుకోలేక, వెనకబడిపోయిన సునీల్ ను మళ్లీ కమెడియన్ గా నిలబెట్టాలని త్రివిక్రమ్ తన అరవింద సమేత సినిమాలో పాత్ర ఇచ్చారు. కానీ అదేమీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు.
అదేకాదు, మరోకొన్ని సినిమాల్లో చేసినా సునీల్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. సునీల్ లో గతంలోని స్పార్క్ మిస్ అయిందని కామెంట్లు వచ్చాయి. ఈ నేఫథ్యంలో బన్నీ సినిమాలో మంచి పాత్ర పడితే, మళ్లీ ముందుకు వెళ్తుంది కెరీర్ అనుకున్నారు సునీల్ అభిమానులు. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా లేనట్లే. బన్నీ సినిమాలో రావురమేష్ నటించాల్సి వుంది. ఆ పాత్రతో పాటు సునీల్ పాత్ర వుంటుందని తెలుస్తోంది.
కానీ ఎప్పడైతే రావు రమేష్ డేట్ లు క్లాష్ వచ్చి, ఆయన బదులు హర్ష వర్ధన్ ను తీసుకున్నారో? అప్పుడు మొత్తం పాత్రనే మార్చేసారని తెలుస్తోంది. దాంతో సునీల్ పాత్ర కూడా లేచిపోయిందని బోగట్టా. బన్నీ సినిమాకు ఆరంభంలో పృధ్వీ వుంటాడని వార్తలు వచ్చాయి. కానీ పృధ్వీ తరచు పవన్ ను విమర్శించిన నేఫథ్యంలో ఆయన పాత్ర తీసేసారు. ఇప్పుడు సునీల్ పాత్ర లేచిపోయింది.