Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మన్మధుడు క్రెడిట్ ఎవరితో తెలియదా నాగ్?

మన్మధుడు క్రెడిట్ ఎవరితో తెలియదా నాగ్?

నాగ్ కెరీర్ లో మన్మధుడు సినిమా మరిచిపోలేని హిట్. ఆ సినిమాలో ఫన్ ఎప్పటికీ మరిచిపోలేనిది. కానీ దాని వెనుక వున్నది డైరక్టర్ విజయ భాస్కర్ కాదు. రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. వాస్తవానికి తివిక్రమ్ శ్రీనివాస్ ఆయన దగ్గర నుంచి తప్పుకుని, స్వంతగా డైరక్టర్ అయిన తరువాత విజయభాస్కర్ హిట్ కొట్టలేకపోయారు. రెండే సినిమాలు చేసారు. ఒకటి ఫ్లాపు, రెండోది యావరేజ్ రీమేక్.

విజయభాస్కర్ కెరీర్ లో చేసిన సినిమాలు అన్నింటి వెనుక త్రివిక్రమ్ పెన్ వుంది. ఇది ఇండస్ట్రీకి తెలిసిన సత్యం. కానీ హీరో నాగ్ కు మాత్రం తెలియదు అనుకోవాలి. మన్మధుడు 2 సినిమా ఫంక్షన్ లో మన్మధుడు సినిమా ఎంటర్ టైన్ మెంట్ అంతటికీ విజయభాస్కర్ నే కారణం అంటూ కితాబు ఇచ్చాడు.

ఆ సినిమా రైటర్, ఇప్పటి టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ ను మాట వరసకైనా తలుచుకోలేదు. పదే పదే విజయభాస్కర్ నే పొగిడారు. అంతే కాదు ఆ సినిమా పంచ్ డైలాగులు అన్నీ విజయభాస్కర్ వే అని కూడా అనేసారు. ఇది మరీ టూమచ్.

మరి నాగ్ తెలియక చేసారా? తెలిసే కావాలని త్రివిక్రమ్ పేరు ఇగ్నోర్ చేసారనుకోవాలా? అన్నపూర్ణ క్యాంపస్ లో ఇఫ్పటి వరకు త్రివిక్రమ్ సినిమా చేయలేదు. ముగ్గురు హీరోలు వున్నా ఆయన ఎవ్వరితో సినిమా చేయలేదు. కానీ అక్కినేని వారి కోడలు సమంత మాత్రం త్రివిక్రమ్ ఫ్యావరెట్ హీరోయిన్. ఆమెతో మంచి సినిమాలు చేసారు.

నాగ్ చెప్పకపోయినంత మాత్రాన త్రివిక్రమ్ కు వచ్చిన నష్టం లేదు. మన్మధుడు సినిమాలోని బ్రహ్మీ, సునీల్, ధర్మవరపు కామెడీ ట్రాక్ ల సృష్టి కర్త ఎవ్వరో? ఆ సినిమాలో పంచ్ డైలాగులు అన్నీ ఎవ్వరివో జనాలకు బాగా తెలుసు.

తెలుగుదేశం.. ‘నో ప్లాన్’ వారి గేమ్ ప్లాన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?