అలాంటి మాటలే భయాల్ని పెంచుతున్నాయ్!

జమ్మూకాశ్మీర్ లో ఏదో జరుగుతోంది. ఈ భయం దేశమంతా పుష్కలంగా వ్యాపించింది. మోడీ సర్కారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నదని పర్యవసానంగా జమ్మూకాశ్మీర్ మంచులోయలు మొత్తం అతలాకుతలం కాబోతున్నాయని మాత్రం ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.…

జమ్మూకాశ్మీర్ లో ఏదో జరుగుతోంది. ఈ భయం దేశమంతా పుష్కలంగా వ్యాపించింది. మోడీ సర్కారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నదని పర్యవసానంగా జమ్మూకాశ్మీర్ మంచులోయలు మొత్తం అతలాకుతలం కాబోతున్నాయని మాత్రం ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. వేల సంఖ్యలో కొత్తగా ప్రతిరోజూ ఆ ప్రాంతానికి తరలుతున్న సీఆర్పీఎఫ్ బలగాలు, అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు ‘పారిపోతున్న’ ప్రజలు, అమర్ నాధ్ యాత్ర నుంచి తిరుగుముఖం పడుతున్న భక్తులు … ఇవన్నీ కూడా అందుకు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి.

కానీ.. కేంద్రప్రభుత్వం తరఫునుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనలు రావడంలేదు. కాపోతే.. కిషన్ రెడ్డి లాంటి కొందరు నాయకులు మాట్లాడుతున్న మాటలు.. ప్రజల్లో కొత్త భయాలను రేకెత్తిస్తున్నాయి. కిషన్ రెడ్డి మాటలను కేంద్ర ప్రభుత్వం మాటలుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఆయన కేంద్ర హోంశాఖకు సహాయమంత్రి. ఇతర ప్రాంతాలకు చెందిన అక్కడి విద్యార్థులను ఖాళీ చేయించడానికి స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ చర్యలు జరుగుతున్నాయి. కానీ.. కిషన్ రెడ్డి స్వయంగా.. విద్యార్థుల తరలింపు గురించి ప్రస్తావించడం.. ఖచ్చితంగా భయాన్ని పెంచే వ్యవహారమే.

అమరనాధ్ యాత్రికులను వెనక్కు పంపడానికి మాత్రం కిషన్ రెడ్డి ఐబీ నివేదికను ఆధారంగా వాడుకుంటున్నారు. ఉగ్రవాదుల ప్రమాదం పొంచి ఉందని అందుకనే భక్తులను తిప్పి పంపుతున్నామని అంటున్నారు. మరి, విద్యార్థులను ఎందుకు తిప్పి పంపుతున్నట్లు? వారికి ఏ ప్రమాదం పొంచి ఉంది? స్పష్టతలేదు. ఒక వైపు ఆయన జమ్మూ కశ్మీర్ లో తెలుగు ప్రజలు సహా ఎవ్వరి భద్రతకు ఢోకాలేదని అంటూనే… విద్యార్థులు పర్యాటకులు వెనక్కు మళ్లి తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశామంటూ మాట్లాడడం సందేహాలను పెంచుతున్నదే.

మరోవైపు అక్కడి గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా అనుమానస్పదంగానే మాట్లాడుతున్నారు. జమ్మూకాశ్మీర్ కు సంబంధించి రాజ్యాంగ నిబంధనల్లో ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది తనకు సమాచారం లేదని అంటున్నారే తప్ప.. నిర్దిష్టంగా తేల్చి చెప్పడంలేదు. మొత్తానికి కాశ్మీర్ లోయ నిప్పు రాజుకుంటోంది. ఆ అగ్నికీలలు ఆ మంచులోయలను మాత్రమే దగ్ధం చేస్తాయా… దావానలంలాగా యావత్ దేశానికి వ్యాపిప్తాయా అనేది మాత్రం తెలియడంలేదు.

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన