రష్మిక ఆ రేంజ్ కు వెళ్లాలనుకుంటోందట!

దక్షిణాదిన పలువురు హీరోయిన్ల స్టార్ స్టేటస్ పతాక స్థాయికి చేరిన వైనం అందరికీ తెలిసిందే. కొందరు హీరోయిన్లు  దశాబ్దాలకు దశాబ్దాలు తెరను ఏలారు. సూపర్ స్టార్లుగా చలామణి అయ్యారు. వారిని ప్రేక్షకులు దేవతల్లా చూశారు. ఏకంగా…

దక్షిణాదిన పలువురు హీరోయిన్ల స్టార్ స్టేటస్ పతాక స్థాయికి చేరిన వైనం అందరికీ తెలిసిందే. కొందరు హీరోయిన్లు  దశాబ్దాలకు దశాబ్దాలు తెరను ఏలారు. సూపర్ స్టార్లుగా చలామణి అయ్యారు. వారిని ప్రేక్షకులు దేవతల్లా చూశారు. ఏకంగా గుళ్లను కూడా కట్టారు!

అలా సౌతిండియాలో తొలిసారి గుడిని కట్టించుకున్న హీరోయిన్ ఖుష్బూ. తను దగ్గరుండి ఆమె గుడి కట్టించుకోలేదు.. తమిళ ప్రేక్షకులకు అభిమానం ఎక్కువై ఆమెకు  ఒక గుడి కట్టారు. అలా ఆమెను దేవతలా చూశారు!

ఆ తర్వాత ఎప్పుడో ఆ గుడిని కట్టిన వారే కూలగొట్టినట్టుగా ఉన్నారు. అది వేరే సంగతి. అయితే  హీరోయిన్లకు జనాల్లో క్రేజ్  విషయంలో ఖుష్బూ గుడి ఒక ప్రామాణికం.ఇప్పుడు రష్మిక ఆ ప్రస్తావన తీసుకొస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించింది. హీరోయిన్ గా తను చిరకాలం ప్రేక్షకులకు గుర్తుండి పోవాలనేదే ధ్యేయమని ఆమె ప్రకటించింది.

ఖుష్బూకు గుడి కట్టించిన విషయాన్ని తన తండ్రి చిన్నతనంలో తనకు చెప్పేవాడని.. తను కూడా ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అనుకుంటున్నట్టుగా రష్మిక వివరించింది. మొత్తానికి రష్మిక భారీ టార్గెట్ నే పెట్టుకుంది. ప్రస్తుతం చేతినిండా స్టార్ హీరోల సినిమాలను కలిగి ఉన్న రష్మిక వీటిల్లో కొన్ని హిట్ అయినా ఎలైట్ లీగ్ లోకి చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన