కేంద్రం ఆ పని చేస్తే బాబు ఎన్‌డీఏలో చేరతాడట

ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు, కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. జనసేన ఆల్రెడీ ఎన్‌డీఏలో ఉంది.  కాబట్టి ఎన్‌డీఏలో చేరాల్సింది టీడీపీ మాత్రమే. టీడీపీకిగాని, జనసేనకుగాని, బీజేపీకిగాని ఒంటరిగా పోటీ…

ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు, కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. జనసేన ఆల్రెడీ ఎన్‌డీఏలో ఉంది.  కాబట్టి ఎన్‌డీఏలో చేరాల్సింది టీడీపీ మాత్రమే. టీడీపీకిగాని, జనసేనకుగాని, బీజేపీకిగాని ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే దమ్ము, ధైర్యం ఏమాత్రం లేవనే సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను అని పవన్‌ కళ్యాణ్‌ చాలాసార్లు చెప్పాడు. మూడు పార్టీలూ పొత్తు పెట్టుకోవాలని ఆయనకూ ఉంది. టీడీపీని కలుపుకోవాలని బీజేపీకీ ఉంది. కాని ఎవరూ బయటపడటంలేదు. 

పవన్‌కేమో తాను సీఎం కావాలని బలంగా ఉంది. కాని అది ఎలా సాధ్యమో ఆయనకే తెలియాలి. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకొని ఒక కూటమిగా ఏర్పడ్డాయని అనుకుందాం. ఈ కూటమి గెలుస్తుందనే అనుకుందాం. అప్పుడు చంద్రబాబే సీఎం అవుతాడుగాని పవన్‌కళ్యాణ్‌నో, బీజేపీనో గద్దెనెక్కించడు కదా. ఈ మూడు పార్టీలు ఒంటరిగా పోటీ చేయలేవు. అలాగని పొత్తులు పెట్టుకోవడానికి రాజకీయ అహం అడ్డొస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రానికి ఓ సుదీర్ఘ లేఖ రాశారని సమాచారం.

అందులో ఆయన అడిగింది కనుక కేంద్రం నెరవేరిస్తే ఎన్‌డీఏలో చేరడానికి అభ్యంతరం ఉండదట. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఇంత కాలం కేంద్రం పట్టించుకోకపోయినా ఎన్నికలకు ముందు వాటిపై కేంద్రం చర్యలు తీసుకోవాల్సిందేనని బాబు  పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. 

గత వారం టీడీపీ అధినేత కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు.  9 పేజీల ఆ సుదీర్ఘమైన లేఖలో ఏపీ ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు తనపై జరిగిన ఉద్దేశపూర్వక దాడులు, హత్యాయత్నాల కుట్రలు చెబుతూ.. తన ప్రాణానికీ ముప్పు ఉందన్న సందేశం పంపారు. 

దీనికి సాక్ష్యంగా 70 పేజీలకుపైగా డాక్యుమెంట్లు, వీడియోలు పంపించారు. వీటిపై చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ఆశిస్తున్నారు. తాను రాసిన లేఖలో ఉన్న అంశాలపై కేంద్రం స్పందిస్తే.. ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు అంగీకరించే అవకాశం ఉందట. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరాలని బారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుటోంది. జాతీయ మీడియాలో ఈ అంశంపై తరచూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.  చంద్రబాబునాయుడు కూడా తాము బీజేపీ విధానాలతో ఏకీభవిస్తామని ప్రకంచారు. మోదీ పరిపాలన విధానాన్ని ఆయన సమర్థించారు.

అయితే ఎన్డీఏలో చేరికపై మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు. ఏదీ తేల్చడం లేదు. గతంలో ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయ్యారు. తర్వాత వారు ఏపీలో బహిరంగసభలు పెట్టి వైసీపీని విమర్శించారు. రాష్ట్రంలోనూ వైసీపీపై బీజేపీ నేతలు యుద్ధం ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్డీఏలో చేరడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఎందుకు సందేహిస్తున్నారన్న అంశం జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశం అవుతోంది. మరి ఇప్పడు బాబు లేఖ రాశారు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం కేంద్రం వ్యవహరిస్తే బీజేపీతో పొత్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారేమో చూడాలి. 

ఇదిలా ఉంటే.. వైసీపీని బీజేపీ మిత్రునిగా చూడలేదు. అలాగని శత్రువూ కాదు. వైసీపీకి ఉన్న ఎంపీల బలం.. పూర్తిగా బీజేపీదే. వారు కోరే కొన్ని పనులు చేస్తే చాలు .. ఇతర విషయాల్లో ఇబ్బంది పెట్టరు.  మనతో స్నేహంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటే ఎలా అన్న మీమాంస బీజేపీ నేతల్లో ఉందని చెబుతున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో  బీజేపీ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకం అవుతుంది.