ఏవీ సుబ్బారెడ్డి అంటే భూమా నాగిరెడ్డి ఆత్మ అని కర్నూలు జిల్లాలో పేరు. అలాంటి ఆత్మ భూమా నాగిరెడ్డి కూతురు, అల్లుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఏవీ సుబ్బారెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు కర్నూలు జిల్లాలో పెను దుమారం రేపుతున్నాయి. టీడీపీ నాయకుడైన ఏవీ సుబ్బారెడ్డి తన పార్టీకే చెందిన మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె భర్తపై తీవ్ర ఆరోపణలు చేయడం ప్రాధా న్యం సంతరించుకుంది.
ఏవీ సుబ్బారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించాడు. అఖిలప్రియ అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజీవరెడ్డితో చేతులు కలిపి తనను భౌతికంగా అంతమొందించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చంపడానికి రూ.50 లక్షలకు సుపారీ కూడా మాట్లాడుకున్నారని ఆరోపించాడు. అఖిలప్రియ దంపతులు పన్నిన కుట్రను కడప పోలీసులు భగ్నం చేసి, తనను కాపాడారని ఆయన అన్నాడు.
పోలీసుల విచారణలో భూమా అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బు ఇచ్చినట్టు నిందితులు అసలు నిజాలు వెల్లడించా రన్నాడు. తనను చంపేందుకు కుట్ర పన్నిన అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాముడిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఏవీ వేడుకు న్నాడు. ఏవీ సంచలన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.