తమ హావభావాలతో మాట్లాడుతూ ప్రజలకు, మీడియాకు కావాల్సిన వినోదం పంచే జేసీ బ్రదర్స్ మరోసారి వార్తలోకి వస్తున్నారు. అధికారంలో ఉన్న లేకపోయిన జేసీ సోదరులకు పోలీసులతో గొడవలు కామన్ అయినట్లు కనపడుతోంది. తాజాగా తాడిపత్రి కి నేనే పెద్ద రౌడీ అని స్వయానా చెప్పుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి డీఎస్పీ పై వ్యతిగతంగా విమర్శలు చేస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రభాకర్ రెడ్డి అన్న జేసీ దివాకర్ రెడ్డి నోటి దురుసు వల్ల ఒక మాములు సీఐ ఉండే వ్యక్తి ఎంపీ అయ్యారు. అప్పట్లో పోలీస్ లపై అయన అన్న మాటలు రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్ధ జేసీ బ్రదర్స్ పై కొప్పడ్డారు. జేసీ బ్రదర్స్ పోలీసులు తము చెప్పింది వినకపోతే తాడిపత్రి రూరల్ పోలీసు స్టేషన్ బయట టెంట్ వేసుకొని నోటీకి పని చెప్పాడం పరిపాటి.
జేసీ బ్రదర్స్ రాజకీయం మొదటి నుండి ఇదే పంధాతో వెళ్తున్నారు. ఎక్కడైనా తమ లారీలు, బస్సులు ఎవరైనా అధికారులు ఆపితే వారిపై గొడవలకు దిగడం, బెదిరిచడం అలవాటు. వయసు పెరిగిన కూడా ఇంకా అదే రాజకీయాలు చేస్తున్నారు. టూరిస్టులకు ఎక్కువ స్థానికంగా తక్కువగా ఉండే జేసీ బ్రదర్స్ కొడుకులు పెద్దవారికి ఇప్పుడు రాజకీయాలు గురించి చెప్పడం లేదేమో అందుకే కాలం చెల్లిన రాజకీయాలే చేస్తున్నారు.
రాజకీయంగా పొరాడాల్సింది తమ వ్యతిరేక పార్టీలతో, నాయకులతో తప్పా ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదంటూన్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల కాలంలో ప్రభాకర్ రెడ్డి అన్న దివాకర్ రెడ్డి సైలెంట్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డి నోటి దురుసు వల్ల మీడియాలో కనపడుతున్నారు.