ఏ ముహూర్తాన ఆర్-ఆర్-ఆర్ సినిమాను ప్రారంభించారో కానీ, మినిమం గ్యాప్స్ లో ఆ సినిమాకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ ఫిట్ గా ఉన్నాడనుకునే టైమ్ కు చరణ్ గాయపడుతున్నాడు. చరణ్ ఫిట్ గా ఉన్నాడనుకునే టైమ్ కు ఎన్టీఆర్ గాయపడుతున్నాడు. తాజాగా తారక్ గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి.
మరో వారంరోజుల్లో తమిళనాడులో భారీ షెడ్యూల్ పెట్టుకున్నాడు. ఇది ఏకంగా 35 రోజుల షెడ్యూల్. పైగా ఎన్టీఆర్ పై ఎక్కువగా ప్లాన్ చేసిన షెడ్యూల్. మరికొన్ని రోజుల్లో షూటింగ్ ఉందనగా తారక్ గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎక్కడ గాయపడ్డాడు, ఎలా గాయపడ్డాడు లాంటి విషయాలపై ఎలాంటి క్లారిటీలేదు. యూనిట్ కూడా ఈ విషయంలో మౌనం వహించింది.
పూణె షెడ్యూల్ లో రామ్ చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. దీనివల్ల షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. ఆ తర్వాత హైదరాబాద్ లోనే ఈ సినిమా షెడ్యూల్ ను కొనసాగించారు. ఇప్పుడు తమిళనాడులో మరో భారీ షెడ్యూల్ అనుకునే టైమ్ కు ఎన్టీఆర్ గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించేందుకు ఎన్టీఆర్ మేనేజర్ కూడా నిరాకరించడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
ఆర్-ఆర్-ఆర్ సినిమాను వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ టైమ్ కు సినిమా కచ్చితంగా రెడీ అయి తీరుతుందని రీసెంట్ గా నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించాడు. అతడు అలా వారం రోజులైనా కాకుండానే, ఇప్పుడు ఎన్టీఆర్ గాయపడినట్టు వార్తలొస్తున్నాయి.