రాధేశ్యామ్ – ఆ 20 నిమిషాలు స్పెషల్

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రాధేశ్యామ్ సినిమా గురించి. దాని అప్ డేట్ గురించి. ట్విట్టర్ లో అయితే ఆ సినిమా యూనిట్ ను, ఆ సినిమా పీఆర్ టీమ్ ను ఓ…

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రాధేశ్యామ్ సినిమా గురించి. దాని అప్ డేట్ గురించి. ట్విట్టర్ లో అయితే ఆ సినిమా యూనిట్ ను, ఆ సినిమా పీఆర్ టీమ్ ను ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. కానీ ఒక్క అప్ డేట్ అయినా రావడం లేదు. ఆ ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్. 

ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి రాధేశ్యామ్ ప్రచారానికి తెరలేవనుంది. ముందుగా మేకింగ్ వీడీయో వచ్చే అవకాశం వుంది. ఆ తరువాత పాటలు. 

దాదాపు నాలుగు నెలలు ముందుగా పాటలు ఇవ్వడం అన్నది టాలీవుడ్ కు అలవాటు కానీ బాలీవుడ్ కు కాదు. అదే సమస్య. అందుకే మెలమెల్లగా మెటీరియల్ బయటకు వదుల్తారు.

ఇదిలా వుంటే రాధేశ్యామ్ సినిమాలో చివరి 20 నిమషాల్లో గ్రాఫిక్స్ వర్క్ పీక్స్ లో వుంటుందని తెలుస్తోంది. ఈ వర్క్ ను, సినిమాలో మిగిలిన సిజి వర్క్ ను దాదాపు 60 స్టూడియోలకు కొద్ది కొద్దిగా ఇచ్చారు. 

అవన్నీ రెడీ అవుతున్నాయి. వింటేజ్ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న లవ్ స్టోరీ ఆధారంగా రాధేశ్యామ్ తయారవుతోంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.