విశాఖకు గ్లోబల్ పొటెన్షియాలిటీ ఉంది

విశాఖ అంటేనే ఆకట్టుకునే సిటీ అని బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కితాబు ఇచ్చేశారు. విశాఖకు గ్లోబల్ పొటెన్షియాలిటీ ఉంది అని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఏ సిటీ అయితే మనుషులను ఆకర్షించే…

విశాఖ అంటేనే ఆకట్టుకునే సిటీ అని బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కితాబు ఇచ్చేశారు. విశాఖకు గ్లోబల్ పొటెన్షియాలిటీ ఉంది అని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఏ సిటీ అయితే మనుషులను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుందో అక్కడ అభివృద్ధి అన్నది కచ్చితంగా జరిగి తీరుతుందని ఆయన అంటున్నారు.

ఏపీలో తాజాగా పర్యటించిన ఆయన విశాఖలోనూ తాను పర్యటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. విశాఖ చక్కని నివాస ప్రదేశమే కాదు, ప్రగతికి రాదారి అని కూడా అండ్రూ ఫ్లెమింగ్ చెప్పడం విశేషం. 

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం జగన్ దార్శనికతను నిదర్శనం అని కూడా ఆయన పేర్కొన్నారు. విశాఖ గ్లోబల్ సిటీ అని, దాని ఎదుగుదలకు అడ్డూ, అదుపూ లేవని కూడా ఆయన అన్నారు.

విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ అని, విశాలమైన నగరం కాబట్టి అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు. తాను ప్రపంచంలో ఎన్నో నగరాలు తిరిగాను అని దాదాపు వంద సుందరమైన నగరాలతో పోలిస్తే విశాఖ వాటి కంటే మిన్న అని చెప్పగలను అని ఆయన అనడం సిటీ ఆఫ్ డెస్టినీకి గొప్ప పొగడ్తగానే చూడాలి. 

తాను విశాఖ ప్రేమలో పడిపోయాను అని ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్పిన మాటలు వింటే ఈ నగరం మీద అభిమానంతో పాటు గర్వం కూడా అధికమవడం ఖాయం.