68వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ అవార్డు గ్రహీతలకు బహుకరించారు. అప్పటికే వెల్లడైన విజేతల వివరాల ప్రకారం… జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డుల్లో సౌత్ సినిమాలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి.
జాతీయ ఉత్తమ నటుడిగా తమిళనటుడు సూర్య అవార్డును పొందాడు. సూరారై పొట్రు సినిమాలో నటనకు గానూ సూర్య జాతీయ అవార్డును పొందాడు. సూర్యతో పాటు అజయ్ దేవగణ్ కు కూడా ఈ అవార్డు దక్కింది. తన్హాజీ సినిమాకు గానూ అజయ్ కు ఈ అవార్డు లభించింది.
ఇక ఉత్తమ నటిగా నలిచింది సూరారై పొట్రు హీరోయిన్ అపర్ణా బాలమురళి. జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు ఈ ఏడాదికి మలయాళీ దర్శకుడు శచికి దక్కింది. అయ్యప్పనుమ్ కోషియుం సినిమాకు గానూ ఈ దర్శకుడి అవార్డు దక్కింది. శచి 2020లోనే దివంగతులయ్యారు.
ఉత్తమ చిత్రంగా సూరారై పొట్రు నిలిచింది. అలాగే మలయాళీ సినిమా అయ్యప్పనుమ్ కోషియుం నటుడు బిజూ మీనన్ కు సపోర్టింగ్ ఆర్టిస్ట్ కేటగిరిలో జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా యాక్షన్ డైరెక్షన్ విభాగంలో కూడా అవార్డును పొందింది.
ఇక ఉత్తమ ప్రాంతీయ కేటగిరిలో తెలుగు సినిమా కలర్ ఫోటోతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ, మరాఠీ, అస్సామీ, బెంగాళీ భాషల సినిమాలకు కూడా అవార్డులు లభించాయి.