జీతాలు మహాప్రభో…?

కరోనా టైమ్ లో హాఫ్ శాలరీలు, నిల్ శాలరీలు అన్ని రంగాల్లో కామన్ విషయం. అయితే కొన్ని సంస్థలు ఉద్యోగులను బట్టి, వారి వ్యవహారాలను బట్టి ఫుల్ శాలరీలు ఇచ్చే సందర్భాలు వున్నాయి. టాలీవుడ్…

కరోనా టైమ్ లో హాఫ్ శాలరీలు, నిల్ శాలరీలు అన్ని రంగాల్లో కామన్ విషయం. అయితే కొన్ని సంస్థలు ఉద్యోగులను బట్టి, వారి వ్యవహారాలను బట్టి ఫుల్ శాలరీలు ఇచ్చే సందర్భాలు వున్నాయి. టాలీవుడ్ లో సిన్మాలు నిర్మాణంలో వున్న చాలా సంస్థలు సగం జీతాలు ఇవ్వడం అన్నది చేస్తున్నాయి. డైరక్టర్ తో సినిమా వుందీ అంటే  డైరక్షన్ డిపార్ట్ మెంట్ టీమ్ కు నిర్మాతే జీతాలు ఇచ్చుకుంటారు. ఇలా చాలా సంస్థల్లో సినిమాలు నిర్మాణంలో వున్నాయి. గత మూడు నెలలుగా సగం జీతాలు ఇస్తున్నారు. ఈ నెల కూడా సగం జీతాలే అందుతున్నాయి.

కానీ ఓ పెద్ద నిర్మాణ సంస్థలో ఓ పెద్ద సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ కావాల్సి వుంది. మరి కొన్ని ప్రాజెక్టులు లైన్ లో వున్నాయి.  ఓ ప్రాజెక్టు మీద గత ఆరేడు నెలలుగా వర్క్ జరుగుతోంది. మరో పెద్ద ప్రాజెక్టులు మూడు పైప్ లైన్ లో వున్నాయి. ఇలా చాలా టీమ్ ఈ ప్రొడక్షన్ హవుస్ మీద ఆధారపడి వుంది. కానీ వివిధ డైరక్టర్ల కోసం డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారందరికీ  జీతాలు అందడం లేదని తెలుస్తోంది. 

కీలకమైన అసోసియేట్ లు, డైరక్టర్ కు కావాల్సిన వారికి మాత్రం ఫుల్ శాలరీలు ఇస్తున్నారని, చివర్న వుండే అసిస్టెంట్ డైరక్టర్లు లాంటి వారికి అస్సలు ఇవ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మెయిన్ అసోసియేట్ ద్వారా డైరక్టర్ దృష్టికి తేవాలన్నా, ఫలితం లేకపోయిందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కరోనా కష్టాలు టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వున్నాయి.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం