బీజేపీ డబ్బులు జగన్ వాడేస్తున్నారుట

ఏపీకి ఆదాయం లేదన్న సంగతి తెలుసు. అయినా కేంద్రం డబ్బులు ఇచ్చిందని వాటిని ఇక్కడ  వాడేస్తున్నారని దెప్పుతారు. నిజానికి విభజన చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఎంత ఇవ్వాలి. ఎంత ఇచ్చింది ఈ లెక్కలు…

ఏపీకి ఆదాయం లేదన్న సంగతి తెలుసు. అయినా కేంద్రం డబ్బులు ఇచ్చిందని వాటిని ఇక్కడ  వాడేస్తున్నారని దెప్పుతారు. నిజానికి విభజన చట్టం ప్రకారం కేంద్రం ఏపీకి ఎంత ఇవ్వాలి. ఎంత ఇచ్చింది ఈ లెక్కలు మాత్రం బీజేపీ నేతలు ఎవరూ కూడా చెప్పకుండా తప్పించుకుంటారు.

అన్ని రాష్ట్రాలతో పాటుగా తలా ఓ రూపాయి ఏపీకి విదిలిస్తే  అదే గొప్ప అనుకోమంటారు. అది మా వాటా అని కూడా చెబుతారు, డప్పు కొడతారు. ఏపీలో పుట్టిన బీజేపీ నేతలకు సొంత రాష్ట్రం మీద ఏమాత్రం సోయి ఉన్నా కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెస్తారు, ఏపీ కోసం కేంద్రంతో పోరాడుతారు, తప్ప ఆర్ధికంగా ఇబ్బందులో ఉన్న ప్రభుత్వం కాళ్ళ కింద పల్లేరు ముళ్ళు పెట్టి గుచ్చరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అదే స‌మయంలో కేంద్రంలో బీజేపీ పాలన ఆహా, ఓహోట. అన్ని విధాలుగా దేశాన్ని మోడీ ముందుకు తీసుకుపోతున్నారుట. మరి అంతలా దేశాన్ని అభివ్రుధ్ధి చేస్తున్న మోడీని ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మని ఎందుకు  అడగరో బీజేపీ  విష్ణు కుమార్ రాజు రాజు లాంటి వారు  చెప్పరు. అసలు ఆ ఊసే తలవరు.

ఇక కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు  ఇచ్చేస్తూంటే వాటి మీద తన పార్టీ స్టాంప్ కొట్టేసుకుని జగన్న తోడు అని చెప్పేసుకుంటున్నారుట. ఏపీలో వైసీపీ పాలన ఏం బాగుందని సంబరాలు చేసుకుంటారు అంటూ పెద్ద ప్రశ్ననే వేస్తున్నారు రాజు గారు.  ఇక  జగన్ పాలనను కొలిచే కొత్త సాధనాన్ని బీజేపీ రాజు గారు కనిపెట్టారు. దాన్ని ఆయన వైసీపీ మీదనే ప్రయోగిస్తున్నారు. వైసీపీ సర్కార్ అడుగులు కొలుస్తూ పాలన ఎలా సాగుతోందో ఇట్టే చెప్పేస్తున్నారు.

ఏపీలో వైసీపీ సర్కార్ ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తోందిట. ఆ అడుగులు కూడా తడబడుతున్నాయట. ఇదీ రాజు గారి రాజకీయ భాష్యం. అయినా సాదా సీదాగా ఆరోపణలు చేయడం పచ్చ పార్టీ నుంచి బీజేపీ నేతలు కూడా బాగా నేర్చేసినట్లున్నారని సెటైర్లు గట్టిగా  పడుతున్నాయి.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం