లవ్ స్టోరీ రేట్లు ఎక్కువా? తక్కువా?

నాగ్ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో టాలీవుడ్ ఏస్ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ నిర్మిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు విక్రయించేసారు. ముఖ్యంగా డిజిటల్, శాటిలైట్ హక్కులు ఎప్పుడో…

నాగ్ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో టాలీవుడ్ ఏస్ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ నిర్మిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు విక్రయించేసారు. ముఖ్యంగా డిజిటల్, శాటిలైట్ హక్కులు ఎప్పుడో అమ్మేసారు. అయితే లేటుగా ఇప్పుడు అంకెలు బయటకు వచ్చాయి అంతే. ఆహా ఓటిటి ప్లాట్ ఫారమ్ కు ఆరు కోట్లకు కాస్త అటు ఇటుగా డిజిటల్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది.  అలాగే శాటిలైట్ హక్కులు మా టీవీకి 5.70 కోట్లకు ఇచ్చేసారు.  ఒక విధంగా చైతన్య సినిమాగా ఇది మంచి రేటే.

ఇదిలా వుంటే నితిన్ హీరోగా వెంకీ  అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా రెడీ అవుతోంది. దీని డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిసి 11 కోట్లకు కాస్త అటుగా అమ్మేసారు. నితిన్ హీరోగా, మజ్జు లాంటి యావరేజ్ సినిమా తరువాత వెంకీ అట్లూరి సినిమాగా ఇది మంచి రేటే.

కానీ ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సాయిపల్లవితో అదే సినిమా డైరక్టర్ చేస్తున్న సినిమా, మజిలీ లాంటి సినిమా తరువాత చైతన్య చేస్తున్న సినిమా కనుక, లవ్ స్టోరీకి 12 కోట్లకన్నా ఎక్కువ రావాలి కదా? అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. బహుశా ప్రాజెక్టులోకి చైతూ, సాయిపల్లవి రాక ముందు కొత్తవాళ్లతో సినిమా స్టార్ట్ చేసారు. అప్పుడే డిజిటల్, శాటిలైట్ ఫైనల్ చేసారేమో? అందువల్లే ఈ రేటు ఏమో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం