ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు చేసిన సందడి ఇంతా అంతా కాదు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, ఈ రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా వాటి వాటి స్టామినా చూపించేసాయి. ఇలాంటి సినిమాలు పడిన తరువాత ఆ డైరక్టర్లకు ఎలా వుండాలి? అదిరిపోయే సినిమాలు ఆ వెంటనే పడాలి. అలవైకుంఠపురములో సినిమా అందించిన త్రివిక్రమ్ కు ఆ సమస్య లేదు.
ఎన్టీఆర్, పవన్, బన్నీ ఇలా లైన్ లో హీరోలు రెడీగా వున్నారు. అడగ్గానే డేట్ లు ఇవ్వడానికి రెడీ. అనిల్ రావిపూడి వ్యవహారం వేరు. ఇప్పటికే ఆయన దిల్ రాజు కు ముందే ఎఫ్ 3 కి కమిట్ అయిపోయారు. లేదంటే ఎలా వుండేదో మరి తెలియదు. కానీ చిత్రంగా ఇప్పుడు ఈ ఇద్దరి డైరక్టర్ల సినిమాలు మరో ఏడాదికి కానీ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
'అల వైకుంఠపురములో' తరవాత ఎన్టీఆర్‌కి ఫిక్సయిపోయాడు త్రివిక్రమ్. అయితే ఆయన `ఆర్.ఆర్.ఆర్` పూర్తయ్యేవరకూ బయటకు రాలేడు. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం తప్ప, త్రివిక్రమ్‌కి మరో దారి లేదు. ఎందుకంటే, ఒకసారి కమిట్ అయ్యాక ఆగాల్సిందే.. మరోవైపు అనిల్ రావిపూడి పరిస్థితి కూడా అంతే. ఆయన `ఎఫ్ 3`పై ఫోకస్ పెట్టాడు. దానికి ఇద్దరు హీరోలు కావాలి. వెంకటేష్, వరుణ్ తేజ్.. ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కేది? ఎప్పుడు పూర్తయ్యేది. ఎలా కాదన్నా తదుపరి విడుదలకు మరో యేడాదిన్నర ఆగాలి. అంటే.. 2021 చివరి వరకూ..
అటు త్రివిక్రమ్ సినిమా గానీ, ఇటు.. అనిల్ రావిపూడి సినిమా గానీ రాదు. వచ్చినా మళ్లీ ఒకేసీజన్‌లో వీళ్ల సినిమాలు తలపడే అవకాశం ఉంది. ఏక కాలంలో హడావుడి చేసిన ఇద్దరు దర్శకులు, ఇద్దరూ చెరో సినిమా ఒప్పేసుకుని కూడా ఖాళీగా ఉండడం నిజంగా… అరుదైన విషయమే. కాకపోతే.. అలా టాలెంటెడ్ దర్శకుల నుంచి సినిమాలు రావడం ఇంతింత ఆలస్యం అవ్వడం మాత్రం చిత్రసీమకు, సినీ అభిమానులకూ లోటే.