చాట్ షో లో బాలయ్య-చంద్రబాబు!

తెలుగు చాట్ షో ల్లో బ్లాక్ బస్టర్ ఏదీ అంటే..’అన్ స్టాపబుల్’ అని చెప్పేయచ్చు. సీనియర్ హీరో బాలకృష్ణ దానిని హోస్ట్ చేసిన పద్దతి కానీ, తెరవెనుక రైటర్లు బివిఎస్ రవి అండ్ కో…

తెలుగు చాట్ షో ల్లో బ్లాక్ బస్టర్ ఏదీ అంటే..’అన్ స్టాపబుల్’ అని చెప్పేయచ్చు. సీనియర్ హీరో బాలకృష్ణ దానిని హోస్ట్ చేసిన పద్దతి కానీ, తెరవెనుక రైటర్లు బివిఎస్ రవి అండ్ కో వర్క్ కానీ, అల్లు అరవింద్ సర్కిల్, పలుకుబడి కానీ అన్నీ పనిచేసి ఆ చాట్ షో ను బ్లాక్ బస్టర్ చేసింది. 

ఇప్పుడు సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. ఈ రోజు రోల్స్ రైడా రాసి, పాడిన రాప్ పాటను థీమ్ సాంగ్ గా విడుదల చేసారు. ప్రోమో సాంగ్ షూట్ ను ఒకటి రెండు రోజుల్లో చేయబోతున్నారు.

ఇదిలా వుంటే మొదటి సీజన్ కే చాలా మంది గెస్ట్ లు అయిపోయారు. మరి రెండో సీజన్ సంగతేమిటి? అన్నది పాయింట్. ఇప్పటికే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ జోడీని అప్రోచ్ అయ్యారు. వాళ్లు టెంటటివ్ గా కన్ సెంట్ ఇచ్చారు కానీ ఇంకా డేట్ లు ఫైనల్ కాలేదు. అందువల్ల ఓపెనింగ్ ఎపిసోడ్ అయితే పవన్ తో కాకపోవచ్చు ఎందుకంటే టైమ్ సరిపోవడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా సెకెండ్ సీజన్ కు హైలైట్ గా వుంది. కానీ ఆయనను ఒప్పించి, రప్పించాల్సిన బాధ్యత అరవింద్ మీద పెట్టారు. అందువల్ల అది కూడా ఓపెనింగ్ ఎపిసోడ్ కు రెడీ కాదు.

బాలయ్య బావ, మాజీ సిఎమ్ చంద్రబాబు నాయుడు పేరు కూడా లిస్ట్ లో చేర్చారు. మరి అది ఏ మేరకు పాజిబుల్ అవుతుందో తెలియాల్సి వుంది.

బాలయ్యతో చాలా సినిమాలు చేసిన విజయశాంతి అలాగే మరో హీరోయిన్ ఎవరినైనా కూడా ఈసారి జాబితాలోకి చేర్చారు.

కేవలం సినిమా సెలబ్రిటీలనే కాకుండా ఈసారి పొలిటికల్ సెలబ్రిటీలను కూడా చాట్ షో కు తీసుకురావాలని డిస్కషన్లు జరుగుతున్నాయి. చూస్తుంటే రెండో సీజన్ ను కూడా సూపర్ హిట్ చేయాలని టీమ్ పట్టుదలతో వున్నట్లుంది.