సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.. మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు మహా ప్రస్థానంలో ముగిశాయి. అంత్యక్రియల్లో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్లొన్నారు. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్ధానంలో సాంప్రదాయ పద్ధతిలో తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు మహేశ్ బాబు.
పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబసభ్యులతోపాటు.. సినీ ప్రముఖులు..అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం 4 గంటలకు కన్ను ముసిన ఇందిరా దేవిని కడసారి చూసేందుకు భారీగా ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. ఇందిరా దేవి పార్థివదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారం తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. కృష్ణ- ఇందిరా దేవికు ఐదుగురు సంతానం కాగ ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఈ ఏడాది మొదట్లో మహేశ్ అన్న రమేష్ బాబు మృతి చెందగా.. ఇప్పుడు తల్లి ఇందిరా దేవి దూరం కావడంతో కృష్ణ కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.