భారత్ లో 2 లక్షలకు చేరువైన కరోనా కేసులు

వరుసగా రెండో రోజు ఇండియాలో కరోనా కేసులు 8వేల మార్క్ ను దాటి నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 8171 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య…

వరుసగా రెండో రోజు ఇండియాలో కరోనా కేసులు 8వేల మార్క్ ను దాటి నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 8171 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 198,706కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధిత దేశాల్లో 7వ స్థానంలో కొనసాగుతోంది ఇండియా.

ఇక మృతుల పరంగా చూసుకుంటే.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా కారణంగా మృతిచెందారు. ఒకే రోజులో ఇలా 2వందలకు పైగా మరణించడం వరుసగా ఇది రెండోసారి. తాజా మరణాలతో దేశంలో మృతుల సంఖ్య 5598కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 95వేలమందికి పైగా కరోనా నుంచి కోలుకోగా.. 97వేల మందికి పైగా చికిత్స కొనసాగుతోంది.

రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 70వేలు దాటింది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 2358 కొత్త కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 70,013కు చేరుకుంది. అటు రాష్ట్రంలో 2362 మంది మృతిచెందినట్టు కేంద్రం ప్రకటించింది.

తమిళనాడులో కూడా కరోనా కేసులు ప్రతి రోజూ వేలల్లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో 23,495 కేసులు, ఢిల్లీలో 20,834 కేసులు, గుజరాత్ లో 17,200 కేసులు నమోదయ్యాయి. మరణాల పరంగా మహారాష్ట్ర తర్వాత అత్యథిక మరణాలు గుజరాత్ లో (1063) చోటుచేసుకుంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 63 లక్షలు దాటింది. 3లక్షల 77వేలమంది మరణించగా.. 29 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

తిట్టే వాళ్ళకే ఎక్కువ పెట్టాలి