హీరోయిన్‌తో క‌రోనా డేటింగ్‌

బాలీవుడ్ హీరోయిన్‌తో క‌రోనా వైర‌స్ డేటింగ్ చేస్తోంది. ఆమె కుటుంబ స‌భ్యుల‌పై కూడా క‌రోనా మ‌న‌సు పారేసుకుంది. బాలీవుడ్ ప్ర‌ముఖ సినీ న‌టితో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా పాజిటివ్ అని…

బాలీవుడ్ హీరోయిన్‌తో క‌రోనా వైర‌స్ డేటింగ్ చేస్తోంది. ఆమె కుటుంబ స‌భ్యుల‌పై కూడా క‌రోనా మ‌న‌సు పారేసుకుంది. బాలీవుడ్ ప్ర‌ముఖ సినీ న‌టితో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా పాజిటివ్ అని తేల‌డం సంచ‌ల‌నంతో పాటు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

‘యే రిష్టా క్యా కహ్లేతా హై’ హిందీ సినిమా హీరోయిన్ మోహెనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబసభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.  గ‌త ఏడాది ఉత్త‌రాఖండ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రి కుమారుడు సుయేష్ రావ‌త్‌ను హీరోయిన్ మోహెనా కుమారి సింగ్ పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం డెహ్రాడూన్ నగరంలోని అత్తవారింట్లో ఆమె ఉంటున్నారు.

క‌రోనా  వ్యాప్తి నేప‌థ్యంలో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ప‌క్కాగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ క‌రోనా విజృంభ‌ణ‌ను అడ్డుకోలేని ప‌రిస్థితి. పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌ర్నీ క‌రోనా వెంటాడుతూ భ‌య‌పెడుతోంది.

ఈ నేప‌థ్యంలో   మోహెనా కుమారితోపాటు ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్ లకు కరోనా సోకడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మొద‌ట మోహెనా కుమారి అత్త   అమృతరావత్ కు  కరోనా సోకింది. ఆమెను రిషికేస్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన కుటుంబ స‌భ్యుల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్  మోహెనా కుమారి ట్వీట్ చేసింది.

‘నాకు, నా కుటుంబసభ్యులకు కరోనా వైరస్ సోకిందనే వార్త నిజ‌మే.  మేమంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాం. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. కాబట్టి మేం త్వరలో కోలుకుంటాం అని భావిస్తున్నా’ అంటూ మోహెనా కుమారి త‌మ ఆరోగ్యంపై వివ‌రాలు వెల్ల‌డిస్తూ ఆశాభావం వ్యక్తం చేశారు. 

తిట్టే వాళ్ళకే ఎక్కువ పెట్టాలి