కాజల్ స్పైసీ హంగామా

రణరంగం అంటూ సీరియస్ టైటిల్. పైగా హీరో శర్వానంద్ సీరియస్ లుక్స్. ఇలాంటి సినిమాలో కాస్త రిలీఫ్ ఇవ్వడానికి అన్నట్లు హీరోయిన్ కాజల్ వచ్చేసింది. స్పైసీ లుక్స్, డ్రెస్, డ్యాన్స్ నంబర్ తో. పిల్లా…

రణరంగం అంటూ సీరియస్ టైటిల్. పైగా హీరో శర్వానంద్ సీరియస్ లుక్స్. ఇలాంటి సినిమాలో కాస్త రిలీఫ్ ఇవ్వడానికి అన్నట్లు హీరోయిన్ కాజల్ వచ్చేసింది. స్పైసీ లుక్స్, డ్రెస్, డ్యాన్స్ నంబర్ తో. పిల్లా పిక్చర్ పెర్ ఫెక్ట్ అంటూ బీచ్ పార్టీ సాంగ్ ఒకటి రణరంగం సినిమా కోసం తయారు చేసారు. పక్కా పెప్పీగా వున్న ఈ సాంగ్ సినిమాకు యాడెడ్ అట్రాక్షన్ అవుతుందనేలా వుంది.

డైరక్టర్ సుధీర్ వర్మ ఫ్యావరెట్ మ్యూజిక్ డైరక్టర్ సన్నీ ఎమ్ ఆర్ కంపోజ్ చేసిన సాంగ్ లో బీట్ బాగుంది. బీట్ కు తగినట్లే కొరియోగ్రఫీ సాగింది. కాజల్ డ్రెస్, డ్యాన్స్ మూవ్ మెంట్స్, పాట బీట్ పక్కాగా మ్యాచ్ అయ్యేలా చూసుకున్నారు.

ఇప్పటికి రణరంగం సినిమాకు సంబంధించి మూడోసాంగ్. సుధీర్ వర్మ డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిన రణరంగం సినిమాలో హీరో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఆ రెండు షేడ్స్ లో ఇద్దరు హీరోయిన్లుగా కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ నటిస్తున్నారు. సినిమా ఆగస్టు 15న విడుదల చేస్తారు. 

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు