ఆలీ ఇక హ్యాపీయేనా?

ఎవరైనా, ఏ పార్టీ తీర్థమైనా తీసుకున్నారు అంటే అల్టిమేట్ ప్రయోజనం పదవీయోగమే. 2019 ఎన్నికల సందర్భంగా పలువురు సినిమా జనాలు కూడా వైకాపా తీర్థం తీసుకున్నారు. అలా తీసుకున్నవారిలో కమెడియన్ ఆలీ ఒకరు. అప్పటికే…

ఎవరైనా, ఏ పార్టీ తీర్థమైనా తీసుకున్నారు అంటే అల్టిమేట్ ప్రయోజనం పదవీయోగమే. 2019 ఎన్నికల సందర్భంగా పలువురు సినిమా జనాలు కూడా వైకాపా తీర్థం తీసుకున్నారు. అలా తీసుకున్నవారిలో కమెడియన్ ఆలీ ఒకరు. అప్పటికే పార్టీలో వున్న మరో కమెడియన్ పృధ్వీకి ఇటీవలే పదవీయోగం వచ్చింది. ఎస్ విఎస్ భక్తి ఛానెల్ సిఇఓగా పదవీ స్వీకారం చేసారు. ఇప్పుడు ఆలీ వంతు వచ్చింది.

ఫిల్మ్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ గా ఆలీని నియమిస్తున్నట్లు వార్తలు ఈరోజు గుప్పుమన్నాయి. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆలీ నియామకం పక్కా అని వార్తలు వినవస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో ముందుగా వార్తలు రావడం, ఆ తరువాత తాపీగా ఆదేశాలు రావడం మామూలు అయింది. ఇదీ అంతే అని, ఆదేశాలు వస్తాయని టాక్ వినవస్తోంది.

ఆలీ రాజకీయ ప్రవేశానికి ముందే తన టార్గెట్ ఎమ్మెల్యే కావడం, ఆపై మంత్రి కావడం అని పక్కా చెప్పారు. అయితే వైకాపాలో చేరిన తరువాత మాత్రం ఏ పదవి ఆశించడం లేదని, జగన్ అభీష్టం మేరకు ముందుకు వెళ్తానని అన్నారు. ఆలీకి ఎమ్మెల్సీ ఇస్తారని రాజకీయ వర్గాలు ఊహించాయి. కానీ ఇప్పుడు ఈ పదవి వరించింది. మరి దీంతో ఆలీ సంతృప్తి చెందుతారా? వెయిట్ అండ్ సీ.

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు