రసవత్తర పరిణామాలు.. యడ్యూరప్ప గట్టెక్కినట్టే!

కర్ణాటక రాజకీయ పరిణామాలు రసవత్తరంగానే కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలందరి మీదా అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. తద్వారా వారికి గట్టి ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పీఠం కాంగ్రెస్-జేడీఎస్…

కర్ణాటక రాజకీయ పరిణామాలు రసవత్తరంగానే కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలందరి మీదా అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. తద్వారా వారికి గట్టి ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పీఠం కాంగ్రెస్-జేడీఎస్ ల చేతి నుంచి చేజారినా.. స్పీకర్ పదవి మాత్రం మిగిలే ఉండటంతో ఆ పార్టీలు ఒక ఆట ఆడుకుంటున్నాయి. ముందుగా ముగ్గురు రెబెల్స్ మీద వేటువేశారు. ఆ తర్వాత ఇప్పుడు అందరి మీదా అనర్హత వేటు వేశారు.

ఉప ఎన్నికల్లో కూడా వారు పోటీ చేయకుండా స్పీకర్ అనర్హత వేటు వేయడం గమనార్హం. ఆ సంగతలా ఉంటే.. ఈ అనర్హత వేటుతో భారతీయ జనతా పార్టీకీ కొంత లాభం ఉంది. అదేమిటంటే.. వీరందరినీ మైనస్ చేస్తే, మిగిలిన ఎమ్మెల్యేల్లో బీజేపీ వైపే ఎక్కువ మంది ఉంటారు.

రెబెల్స్ అంతాపోనూ మిగిలిన ఎమ్మెల్యేల్లో బీజేపీ బలం నూటా ఐదు కాగా, కాంగ్రెస్-జేడీఎస్ పక్షాన నిలిచింది 99 మంది. కాబట్టి రెబెల్స్ పై అనర్హత వేటు నేపథ్యంలో సభలో బీజేపీనే  పెద్ద పార్టీగా మిగిలింది. దీంతో బలపరీక్షలో యడ్యూరప్పకు తిరుగులేనట్టే.

అయితే ఉప ఎన్నికలు రావాల్సి ఉంటుంది. ఆ ఉప ఎన్నికల్లో ఎవరు సత్తాచూపిస్తే వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే అనర్హత వేటును ఎదుర్కొంటున్న రెబెల్స్ తాము సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు!

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు