సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి, సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూశారు. కొన్నాళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. భౌతికకాయాన్ని…

కేంద్ర మాజీమంత్రి, సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూశారు. కొన్నాళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్ లోకి ఆయన స్వగృహానికి తరలించారు.

సీనియర్ పార్లమెంటేరియన్ గా జైపాల్ రెడ్డికి విశేషమైన అనుభవం, గుర్తింపు ఉంది. ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ కేబినెట్స్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక, సమాచార ప్రసార శాఖల్ని నిర్వహించారు. అంతేకాదు, సౌత్ నుంచి తొలిసారిగా ఉత్తమ పార్లమెంటేరియన్ పురష్కారాన్ని అందుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు జైపాల్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీలోని అతికొద్ది మంది సీనియర్లలో జైపాల్ రెడ్డి ఒకరు. పార్టీకి, సోనియాకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తన రాజకీయ జీవితంలో మంచి వక్తగా పేరుతెచ్చుకున్నారు.

జైపాల్ రెడ్డి మాట్లాడితే అలా వినాలనిపిస్తుందని చాలామంది పార్లమెంటేరియన్లు మెచ్చుకునేవారు. మీడియా సమావేశాల్లో కూడా కేవలం ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా.. ఓ మంచి విశ్లేషకుడిగా, నిర్మాణాత్మకంగా వ్యవహరించే నేతగా వ్యవహరించేవారు జైపాల్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లాలోని మాడుగులలో 1942లో జన్మించారు జైపాల్ రెడ్డి. ఉస్మానియా నుంచి ఎంఏ చేసిన ఈయన, తొలిసారిగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొంచారు. తర్వాత మెహబూబ్ నగర్ లోక్ సభ సెగ్మెంట్ నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అలా 4సార్లు ఎమ్మెల్యేగా, 5సార్లు ఎంపీగా చేశారు.

జైపాల్ రెడ్డి అంత్యక్రియల్ని నెక్లెస్ రోడ్ లోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన నిర్వహించాలని నిర్ణయించారు. రేపు ఉదయం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమౌతుంది. అప్పటివరకు ఆయన నివాసంతో పాటు గాంధీభవన్ లో భౌతికకాయాన్ని ఉంచుతారు.

డియర్ కామ్రేడ్ పై దర్శకుడి కష్టాలు

ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి