ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం వల్ల మనస్తాపం అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. తన రాజీనామాను వెనక్కు తీసుకొవడం లేదని ఇకపై ఎటువంటి రాజకీయ పదవులు చేపట్టానని కేవలం తన పని తను చేపట్టానని తెలిపారు. పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
తాను రాజీనామా తర్వాత చాల మంది నాకు ఫోన్లు చేసి కుల దోహ్రి, తెలుగు దోహ్రి అని తిడుతున్నారని, ఎందుకు సీఎం జగన్ ను తిట్టలేదని బెదిరిస్తున్నరని వాపోయారు. వారికి సమాధానంగా ఇస్తూ నా దృష్టిలో జగన్ హీరో అని, దేశం మొత్తని శాసించే సోనియా గాంధీతో విభేదించి ఆక్రమ కేసుల్లో జైలు పాలు అయిన కూడా ఎక్కడ తలొగ్గకుండా సీఎం అయ్యారని, నా వల్ల ఒక ఓటు కూడా సీఎం జగన్ కు రాలేకపోయిన నన్ను పిలిచి పదవి ఇచ్చారని తెలిపారు.
నాకు వైయస్ఆర్ అంటే చాల ఇష్టం అని తెలుగు గంగకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, బాలకృష్ణ కోసం వైయస్ఆర్ దగ్గరకు వెళితే పని చేసి పెట్టరని, వైయస్ఆర్ తెలుగు బాషకు ఎంత చేశారో అంత పని వైయస్ జగన్ కూడా చేశారన్నారు. నేనెప్పుడూ జగన్‌ను పల్లెత్తు మాట అనలేదని. మంచి చేసినప్పుడు మంచి చేశారని చెప్పాను అని తెలిపారు.
ఇకపై రాజకీయాలపై మాట్లాడను అంటూనే తనపై రాజకీయా అరోపణలు చేస్తే అందరివి బయట వస్తాయి అని హెచ్చరించారు.