హరీశ్ రావు నిరూపించు మ‌రి!

తెలంగాణ అధికార పార్టీ నేత‌లు త‌మ అభివృధి గురించి కాకుండా ప‌క్క రాష్ట్రాల వారిపై నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్టాడ‌టం ప‌రిపాటిగా అవుతోంది. టీఆర్ఎస్ పెద్ద‌ల నుండి మొద‌లుకొని గ‌ళ్లీ నాయ‌కులు కూడా ఆంధ్ర గురించి…

తెలంగాణ అధికార పార్టీ నేత‌లు త‌మ అభివృధి గురించి కాకుండా ప‌క్క రాష్ట్రాల వారిపై నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్టాడ‌టం ప‌రిపాటిగా అవుతోంది. టీఆర్ఎస్ పెద్ద‌ల నుండి మొద‌లుకొని గ‌ళ్లీ నాయ‌కులు కూడా ఆంధ్ర గురించి మాట్లాడుతూ రోడ్లు, క‌రెంట్ అంటూ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్ల‌డూతూనే ఉంటారు. కానీ వారు అన్నీ అంటూన్నా ఆంధ్ర ప్రాంత నాయ‌కులు నుండి ఎటువంటి స‌మాధానం రాదు. స‌మాధానం ఇస్తే ఎక్క‌డ త‌మ అస్తుల‌కు ముప్పు వ‌స్తుంద‌నే భ‌య‌మే ఏమే కానీ వారు ఏమి మాట్లాడిన తెలు కుట్టిన దోంగలు లాగా ఉంటుంటారు.

తాజాగా కేసీఆర్ అల్లుడు మంత్రి హ‌రీశ్ రావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్ర‌లో రైతుల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం క‌రెంట్ స‌రిగ్గా ఇవ్వ‌టం లేద‌ని, తెలంగాణ‌లో మేము 24 గంట‌లు వ్య‌వ‌సాయానికి క‌రెంట్ ఇస్తున్నామ‌ని చెప్పుతు సీఎం జ‌గ‌న్ పై నోరు ప‌రేసుకున్నారు. దానికి వైసీపీ నుండి స‌మాధానం రాకపోయిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘ‌నంద‌న్ రావు స‌రైన స‌మాధానం చెప్పారు.

తెలంగాణ‌లో వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రెంట్ ఎక్క‌డిస్తున్నారో చెప్పాల‌ని, ఇస్తున్న‌ట్లు నిరూపిస్తే ఏ శిక్ష‌కైనా సిద్ధ‌మ‌ని ర‌ఘ‌నంద‌న్ రావు స‌వాల్ చేశారు. విమానంలో వెళ్లిన మంత్రికి రైతులు ఎక్క‌డ క‌నిపించి చెప్పారో అనేది ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో 9 లేదా 10 గంట‌లు మాత్ర‌మే వ్య‌వ‌సాయానికి క‌రెంట్ ఇస్తున్నార‌ని 24 గంట‌లు అనేది మాట‌ల‌కే ప‌రిమితం అయింద‌న్నారు.

నిజంగా తెలంగాణ‌లో 24 గంట‌లు వ్య‌వ‌సాయానికి క‌రెంట్ ఇస్తూంటే ర‌ఘ‌నంద‌న్ రావు స‌వాల్ ను మంత్రి హారీష్ రావు స్వీక‌రించాలి.ఆంధ్ర ప్రాంత నాయ‌కులు ఏమి అన‌డంలేద‌ని నోటి వ‌చ్చిన మాట‌లు మాట్లాడే తెలంగాణ ప్రాంత అధికార పార్టీ నేత‌లు ఇప్ప‌టికైనా నిజనిజాలు తెలుకోవాలి. ఆర గంట వ‌ర్షం ప‌డితేనే హైద‌రాబాద్ ఎలా ఉంటుందో, రోడ్లు ఎలా ఉన్నాయో ముందుగా వాటిపై దృష్టి పెడితే మంచిది అంటూన్నారు తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు.