డియర్ కామ్రేడ్ సినిమా సందర్భంగా కన్నడ, మలయాళ, తమిళ మీడియాకు లెక్క లేకుండా ఇంటర్వూలు, చిట్ చాట్ లు ఇచ్చుకుంటూ వచ్చాడు హీరో విజయ్ దేవరకొండ. తెలుగులోకి వచ్చేసరికి ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు. సాధారణంగా న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు సినిమా ప్రమోషన్ కు ఎక్కువ ఉపయోగపడతాయి. న్యూస్ రూమ్ డిస్కషన్లు, అలాగే థియేటర్ టాక్ లు, గ్యాసిప్ లు ఇలాంటివి అన్నీ ఇక్కడే చోటు చేసుకుంటాయి.
అందుకే విజయ్ దేవరకొండ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. సినిమా విడుదలయిన తరువాత వీటికి ఇంటర్వూలు ఇస్తానని సినిమా యూనిట్ ద్వారా కన్వే చేసాడు. సినిమా మార్నింగ్ షో పడిన వెంటనే వరుసపెట్టి ఇంటర్వూలు అంటూ ఊరించే ప్రయత్నం చేసాడు. అలా అయితే ఈ మాధ్యమం అంతా కాస్త సాఫ్ట్ గానో, లేదా ఆశతోటో వ్యవహరిస్తుందని విజయ్ నో, లేదా ఆ సినిమా యూనిట్ లో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ ప్లాన్ విజయ్ దో, సినిమా యూనిట్ దో, లేదా పీఆర్ యూనిట్ దో అన్నది మాత్రం క్లారిటీలేదు.
కానీ మీడియాలో సినిమాకు యావరేజ్ రేటింగ్ లే వచ్చాయి. దాంతో ఇంక విజయ్ చటుక్కున మొహం చాటేసాడు. యూనిట్ ను ఈ విషయంలో అడిగితే, తక్కువ రేటింగ్ లు వచ్చాక, ఇక ఇంటర్వూలు ఎందుకు? అయినా సినిమా ప్రమోషన్ కు ఇవి ఉపయోగపడవు అని విజయ్ అంటున్నాడు, లేడీస్ తో, స్పోర్ట్స్ పర్సన్స్ తో చిట్ చాట్ లు అరేంజ్ చేయమని అడుగుతున్నాడు అంటూ వున్న విషయం చెప్పారు.
పెళ్లిచూపులు టైమ్ లో పనికి వచ్చిన మీడియా, డియర్ కామ్రేడ్ దగ్గరకు వచ్చేసరికి చేదయినట్లు కనిపిస్తోంది విజయ్ కు. మళ్లీ ఇప్పట్లో సినిమా ఎలాగూలేదు. క్రాంతిమాధవ్ సినిమా రిలీజ్ టైమ్ కు మళ్లీ అంతా మరిచిపోయి, ఇంటర్వూల కోసం ఎలాగూ వస్తారు. అప్పుడు చూసుకోవచ్చు అని అనుకుంటున్నాడేమో? కానీ మీడియాకు మరీ అంత షార్ట్ టెర్న్ మెమరీ లాస్ వుంటుందా?