ఎట్టకేలకు కలిశారు.. కాంబినేషన్ ఎలా ఉంటుందో!

గతంలో హీరోయిన్ గా కొనసాగిన టైమ్ లో నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి లాంటి హీరోల సరసన నటించింది భూమిక. వెంకీతో వాసు, నాగ్ తో స్నేహమంటే ఇదేరా, చిరుతో జై చిరంజీవ లాంటి సినిమాలు…

గతంలో హీరోయిన్ గా కొనసాగిన టైమ్ లో నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి లాంటి హీరోల సరసన నటించింది భూమిక. వెంకీతో వాసు, నాగ్ తో స్నేహమంటే ఇదేరా, చిరుతో జై చిరంజీవ లాంటి సినిమాలు చేసింది. కానీ బాలయ్యతో మాత్రం సినిమా చేయలేకపోయింది. ఇన్నేళ్లకు భూమిక కోరిక తీరింది. బాలయ్య సినిమాలో అవకాశం దక్కింది.

త్వరలోనే కేఎస్ రవికుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. సెకెండ్ హీరోయిన్ గా భూమికను సెలక్ట్ చేశారు. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య, భూమిక లవర్స్ గా కనిపించబోతున్నారట.

గతంలో చిరంజీవి-భూమిక కాంబినేషన్ ను తెరపై చూసినప్పుడు చాలా విమర్శలు చెలరేగాయి. ఇద్దరి జోడీ అస్సలు బాగాలేదనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు బాలయ్య సరసన నటించనుంది భూమిక. వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది భూమిక. సవ్యసాచి, యూటర్న్, ఎంసీఏ సినిమాల్లో పాత్రలు పోషించింది. సో.. బాలయ్య సినిమాలో కూడా ఆమెకు మంచి పాత్రే దక్కి ఉంటుంది.

ఈ సినిమాకు క్రాంతి అనే టైటిల్ అనుకుంటున్నారు. సి.కల్యాణ్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు స్వయంగా బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేశాడు. అదెప్పుడనేది త్వరలోనే తెలుస్తుంది. ఈలోగా బాలయ్య సూచనల మేరకు కథకు మార్పుచేర్పులు చేసే పని నడుస్తోంది.

డియర్ కామ్రేడ్ పై దర్శకుడి కష్టాలు

ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి