అతడి కోసమే దిల్ రాజు ఇదంతా చేస్తున్నాడా?

తన సొంత బ్యానర్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు దిల్ రాజు. కుదిరితే ఏడాదికి అరడజను చేయాలనేది ప్లాన్. దీంతోపాటు మరోవైపు డిస్ట్రిబ్యూషన్ ఉండనే ఉంది. ఇవికాకుండా ఇప్పుడు బాలీవుడ్ ప్లాన్స్ లో కూడా…

తన సొంత బ్యానర్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు దిల్ రాజు. కుదిరితే ఏడాదికి అరడజను చేయాలనేది ప్లాన్. దీంతోపాటు మరోవైపు డిస్ట్రిబ్యూషన్ ఉండనే ఉంది. ఇవికాకుండా ఇప్పుడు బాలీవుడ్ ప్లాన్స్ లో కూడా ఉన్నాడు. ఎఫ్2, జెర్సీ, ఎవడు అంటూ ఏకంగా 3 రీమేక్స్ లైన్లో పెట్టాడు. ఒక్కమనిషి ఇన్ని పనులు చేయడం సాధ్యమా? ప్రాక్టికల్ గా చూసుకుంటే అసాధ్యం. ఇలాంటి టఫ్ టైమ్ లో కొంతమంది నిర్మాతలతో మరో కొత్త కూటమి ఏర్పాటుచేశాడు దిల్ రాజు.

మంచి కథలు దొరికితే ఎలాంటి అభ్యంతరం లేకుండా వాళ్లతో కలిసి సినిమాలు నిర్మిస్తానని ప్రకటించాడు. దీనికోసం మరో కొత్త బ్యానర్ కూడా పెట్టనని, ఉన్న బ్యానర్ లోనే ఇతర నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మిస్తానని ప్రకటించాడు. అయితే దిల్ రాజు ఇలా ప్రకటించడం వెనక మ్యాంగో రామ్ ఉన్నట్టు తెలుస్తోంది. అవును.. ఇతడితో కలిసి దిల్ రాజు ఇప్పుడు తన వ్యాపారాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

మ్యాంగ్ రామ్ ను ముందుకునెట్టి పలు సినిమాల రైట్స్ దక్కించుకుంటున్నాడు దిల్ రాజు. అంతేకాదు, కొత్తగా ఏర్పాటుచేసిన నిర్మాతల కూటమి వ్యవహారాల్ని కూడా మ్యాంగో రామ్ కు అప్పగించే ఆలోచనలో ఉన్నాడట. ఇలా పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు చాలా వ్యవహారాల్ని తన కనుసన్నల్లో ఉంచుకునే మాస్టర్ ప్లాన్ వేశాడు దిల్ రాజు.

యూట్యూబ్ లో ఒకప్పుడు మ్యాంగో రామ్ సంచలనం. ప్రజలకు, మరీ ముఖ్యంగా సినీజనాలకు అవగాహన లేని టైమ్ లోనే డిజిటల్ రైట్స్ కు శ్రీకారం చుట్టాడీయన. ఎన్నో సినిమాల డిజిటల్ రైట్స్ అతి తక్కువ రేటుకు దక్కించుకున్నాడు. కొన్ని సినిమాలకు సంబంధించి లీగల్ గా కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు. అది వేరే వ్యవహారం.

ఇప్పుడీయన దిల్ రాజుతో కలిసి నెమ్మదిగా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ వైపు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతడి కోసమే దిల్ రాజు కొత్త ప్రణాళికలు మొదలుపెట్టినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌