ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 2944కు చేరుకుంది. వీళ్లలో 2092 మంది డిశ్చార్జ్ కాగా.. 792 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 60 మంది మృతిచెందారు.
ఇక కొత్తగా నమోదైన కేసుల్ని ఓసారి పరిశీలిస్తే.. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల మధ్య 9504 శాంపిల్స్ ను పరీక్షించగా.. వీళ్లలో 70 మందికి పాజిటివ్ తేలింది. అటు నిన్న ఒక్కరోజే 55 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదు.
కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురికి కోయంబేడుతో కనెక్షన్ ఉన్నట్టు అధికారులు నిర్థారించారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో 111 మందికి కరోనా సోకినట్టు నిర్థారించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వాళ్లలో కరోనా సోకిన వాళ్లు 406 మంది ఉన్నారు.
మరోవైపు రేపటితో నాలుగోదశ లాక్ డౌన్ ముగుస్తున్న వేళ.. రాష్ట్రంలో ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో భారీగా మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వం.. జూన్ 1 నుంచి మిగతా ఆంక్షలపైై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై రేపు ఓ నిర్ణయం తీసుకోనుంది.