మహేష్‌ డిమాండ్లతో నిర్మాతలు బేజారు

మహర్షి చిత్రానికి వందకోట్ల షేర్‌ వచ్చినా కానీ నిర్మాతలకి పెద్దగా మిగిలింది లేదు. మహేష్‌ పారితోషికంతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన వేస్టేజీ వల్ల బడ్జెట్‌ అదుపు దాటిపోవడంతో పెట్టుబడి తిరిగి వస్తే…

మహర్షి చిత్రానికి వందకోట్ల షేర్‌ వచ్చినా కానీ నిర్మాతలకి పెద్దగా మిగిలింది లేదు. మహేష్‌ పారితోషికంతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన వేస్టేజీ వల్ల బడ్జెట్‌ అదుపు దాటిపోవడంతో పెట్టుబడి తిరిగి వస్తే చాలుకునే పరిస్థితి తలెత్తింది. అయితే రిలీజ్‌ ప్లానింగ్‌, బిజినెస్‌ వ్యవహారాలని బాగా డీల్‌ చేసిన దిల్‌ రాజుని 'సరిలేరు నీకెవ్వరు'కి కూడా నిర్మాతగా వుండాలని మహేష్‌ పట్టుబట్టాడు.

మహేష్‌ మాట మీద ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్న దిల్‌ రాజు దీనికి మహేష్‌ డిమాండ్‌ చేసిన పారితోషికం పట్ల హ్యాపీగా లేడని గాసిప్స్‌ వున్నాయి. ఈ చిత్రానికి మహేష్‌ వాటాగా యాభై కోట్లు పైగానే వెళుతుందనేది ఇండస్ట్రీ టాక్‌. హీరోనే అంత తీసుకుపోతే ఇక సినిమా బడ్జెట్‌ ఎంత అవుతుంది? చివరకు నిర్మాతకి ఏమి మిగులుతుంది?

మహేష్‌ పేరుని ప్రస్తావించకపోయినా కానీ బాలీవుడ్‌ హీరోల తరహాలో ఇక్కడి స్టార్‌ హీరోలు లాభాల్లో వాటా మాత్రమే తీసుకోవాలని, తద్వారా నిర్మాతపై భారం తగ్గడమే కాకుండా మరింత మంది నిర్మాతలు ఫీల్డులో వుంటారని, ఎక్కువ సినిమాలు రూపొందుతాయని చెప్పాడు. ఇప్పుడు కాకపోయినా మరో రెండు, మూడేళ్లకి అయినా ఈ పద్ధతికి హీరోలు రాక తప్పదని దిల్‌ రాజు అన్నాడు.

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌